residents of Manipur Tungjoy Village build 80 Huts  that ill unction as quarantine centres

వినూత్న ‘క్వారంటైన్ సెంటర్లు’ : ఆ గ్రామస్తుల క్రమశిక్షణకు సీఎం ఫిదా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అది మణిపూర్ రాష్ట్రంలోని టూంజాయ్ గ్రామం. 900 నుంచి 1000 కటుంబాలు ఉంటాయి. వారంతా స్వయంగా క్వారంటైన్ కేంద్రాలను నిర్మించుకున్నారు. వాటి గురించి తెలుసుకున్న రాష్ట్ర సీఎం వారిపై ప్రశంసలు కురిపించారు. మరి ఆ క్వారంటైన్ కేంద్రాల వినూత్నత ఏమిటో తెలుసుకుందాం…

కరోనా వైరస్ వచ్చాక ‘క్వారంటైన్’  అనే మాట సర్వసాధారణంగా వినిపిస్తోంది. అటువంటి క్వారంటైన్ కేంద్రాలను ప్రభుత్వాలే ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తున్నాయి. కానీ మణిపూర్ లోని టుంజాయ్ గ్రామవాసులు మాత్రం ప్రభుత్వం చేసే ఏర్పాట్ల కోసం ఎదురు చూడలేదు. వారికి వారే స్వయంగా 80 క్వారంటైన్ కేంద్రాలు నిర్మించుకున్నారు.

కరోనా (కొవిడ్-19)నియంత్రించటానికి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి..పలు ఇబ్బందులు పడి.. తిరిగి తమ రాష్ట్రానికి చేరుకుంటున్న తమ వారికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా టూంజాయ్ గ్రామస్తులు స్వయంగా 80 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్వారంటైన్ లో ఉండాల్సినవారికి వీటిలో అన్ని సదుపాయాలు కల్పించారు. 

ప్రతి గుడిసెలోనూ ఓ మంచం, ప్రత్యేక టాయిలెట్, గ్యాస్ టేబుల్, విద్యుత్ సదుపాయం, చార్జింగ్ సాకెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నీటి సరఫరాకి కూడా ఏర్పాటు చేశారు అని సాక్షాత్తు మణిపూర్ సీఎం తన ట్విట్టర్ తో తెలిపారు. టూంజాయ్ గ్రామస్తుల క్రమశిక్షణకు తమవారిపై వారికుండే ఆదరణకు ప్రశంసలు కురిపించారు. టూంజాయ్‌ గ్రామంలో పౌముయ్ తెగకు చెందిన ఈ ప్రజల క్రమశిక్షణ, కష్టించే పనిచేసే తత్వాన్ని చూసి సీఎం బీరేన్ సింగ్ సైతం మురిసిపోయారు. 

దీనిపై తన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ..‘‘టుంజాయ్ గ్రామ పంచాయితీకి నా సెల్యూట్. రాష్ట్రం బైట నుంచి రాబోతున్న తమ గ్రామస్తులకు క్వారంటైన్ సదుపాయం కోసం వీరంతా కలిసి ప్రత్యేకంగా 80 గుడిసెలు నిర్మించారు. ప్రతి గుడిసెలోనూ ఓ మంచం, ప్రత్యేక టాయిలెట్, గ్యాస్ టేబుల్, విద్యుత్ సదుపాయం, చార్జింగ్ సాకెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నీటి సరఫరాకి కూడా ఏర్పాటు చేశారు…’’ అని సీఎం ట్వీట్ చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో బస చేసే వారికి రేషన్ సరుకులు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. 

లాక్‌డౌన్‌తో తమ రాష్ట్రానికి చెందిన దాదాపు 40 వేల మంది ప్రజలు ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్నారనీ… వారిలో చాలామంది వెనక్కి తిరిగివచ్చేందుకు ఇష్టపడుతున్నారని సీఎం బీరేన్ సింగ్ పేర్కొన్నారు. అంతేకాదు..టూంజాయ్ గ్రామస్తులు లాక్ డౌన్ నిబంధనలకు చక్కగా పాటిస్తున్నారు. వారి రోజువారీ పనులు కొనసాగించుకుంటున్నారు సామాజిక దూరం పాటిస్తూూ. మనస్సులు దగ్గరగా ఉన్నప్పుడు..మనుషులు దూరంగా ఉంటే ఏమిటి అంటున్నారు. ఇటువంటి క్రమశిక్షణ ఉంటే కరోనా ఏమిటీ దాని తాతలాంటి వైరస్ లు వచ్చినా తరిమికొట్టేయగలం..

Read Here>> అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ కన్నుమూత

Related Posts