జియో ఫైబర్ ఎఫెక్ట్ : ACT ఫైబర్ నెట్‌లో కొత్త Gaming సర్వీసు 

Submitted on 19 September 2019
Reliance JioFiber effect: ACT Fibernet launches gaming subscription service

రిలయన్స్ జియో ఫైబర్ ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. జియో ఫైబర్ రాకతో ఇతర పోటీదారులైన ఎయిర్ టెల్ వి-పైబర్, టాటా స్కై, యాక్ట్ ఫైబర్ నెట్ సర్వీసు ప్రొవైడర్లు కూడా కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. జియో ఫైబర్ వాడుతున్న యూజర్లతో పాటు కొత్త కనెక్షల కోసం ఎంతో మంది యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్రాడ్ బ్యాండ్ సర్వీసుతో పాటు అదనపు సర్వీసులను కూడా జియో ప్రకటించింది. జీరో లాటెన్సీ గేమింగ్ సర్వీసును ప్రవేశపెడుతున్నట్టు స్పష్టం చేసింది. 

జియో ఫైబర్ సర్వీసుకు పోటీగా యాక్ట్ ఫైబర్ కూడా ఇండియాలో యూజర్ల కోసం రెండు కొత్త గేమింగ్ ప్యాకులను తీసుకొచ్చింది. ఒక్కో ప్యాక్.. నెలవారీ, ఆరు నెలల సబ్ స్ర్కిప్షన్ కింద బెనిఫెట్స్ అఫర్ చేస్తోంది. ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ సహా మొత్తం 18 నగరాల్లో ACT బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది. నెలవారీ గేమింగ్ ‘A-Game Basic’ ప్యాక్ తో (ట్యాక్సులతో కలిపి) రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ ప్యాక్ కాల పరిమితి 30 రోజుల వరకు ఉంటుంది. మరో గేమింగ్ ప్యాక్ ‘A-Game Ultra pack’ 6 నెలల కాల పరిమితిపై (ట్యాక్సులతో కలిపి) రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది. జియో ఫైబర్ సర్వీసు అందించే జీరో ల్యాటెన్సీ గేమింగ్ ఆఫర్ కు పోటీగా యాక్ట్ ఫైబర్ ఈ రెండు గేమింగ్ ప్యాకులను ప్రవేశపెట్టింది. అంతేకాదు.. యూజర్ల కోసం పార్టనర్ బెనిఫెట్స్, ఇన్ గేమ్ రివార్డ్స్, స్పీడ్ ఆన్ డిమాండ్, డేటా బూస్ట్ సర్వీసులను కూడా ఆఫర్ చేస్తోంది. సైప్రస్ బెలార్షియాన్ వీడియో గేమ్ కంపెనీ కేంద్ర కార్యాలయమైన వార్ గేమింగ్ గ్రూపు భాగస్వామ్యంతో వరల్డ్ ఆఫ్ వార్ షిప్ గేమ్ ను యాక్ట్ ఫైబర్ ప్రవేశపెట్టింది. 

స్పీడ్ అండ్ డిమాండ్ క్యాపబులిటీని యాక్ట్ యూజర్లకు ఆఫర్ చేస్తోంది. దీంతో యూజర్లు స్పీడ్ బూస్ట్ ఫీచర్ ద్వారా తమ ఇంటర్నెట్ ప్లాన్ ఆన్ డిమాండ్ మెరుగుపర్చుకోవచ్చు. స్పీడ్ బూస్ట్ ఫీచర్ సాయంతో గేమ్ ప్లేయర్లు తమ డేటాను 300Mbps స్పీడ్ వరకు బూస్ట్ చేసుకోవచ్చు. మరింత డేటా కావాలంటే డేటా బూస్ట్ తో అదనంగా నెలకు 200GB వరకు డేటా పొందవచ్చు. A-Game Basic ప్యాక్, A-Game Ultra ప్యాక్ రెండెంటిపై 1800GB వరకు ఆఫర్ చేస్తోంది. 

Reliance JioFiber
 JioFiber
ACT Fibernet
gaming
subscription service
A-Game Ultra pack

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు