యూజర్లకు పండగే : Jio Prime మెంబర్ షిప్.. ఆటో రెన్యూవల్ ఫ్రీ

Submitted on 13 May 2019
Reliance Jio auto renewal to Prime membership subscription for free of cost

రిలయన్స్ జియో కస్టమర్లకు గుడ్ న్యూస్. డేటా సంచలనం రిలయన్స్ జియో.. ప్రైమ్ మెంబర్ షిప్ సబ్ స్ర్కిప్షన్ ఆటో రెన్యూవల్ చేసింది. ప్రైమ్ కస్టమర్ల కోసం ప్రత్యేకించి మరో ఏడాది అదనంగా పూర్తి ఉచితంగా అందిస్తోంది. ప్రైమ్ మెంబర్ షిప్ సబ్ స్ర్కిప్షన్ కు ఏడాదికి రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా యూజర్లు అదనంగా డేటాను పొందవచ్చు.

జియో యాప్స్.. జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్ ను ఫ్రీగా యాక్సస్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ జియో ప్రైమ్ మెంబర్ షిప్ ఏడాది మాత్రమే ఉండేది.. తమ యూజర్ల కోసం రిలయన్స్ జియో ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా మరో ఏడాది వరకు ఫ్రీగా ఆటో రెన్యువల్ అయ్యే అవకాశం కల్పించింది. 

2016 ఏడాది నుంచి రిలయన్స్ జియో.. ఫ్రీ డేటా, కాలింగ్ ఆఫర్లను ఆరు నెలల పాటు అందిస్తు వచ్చింది. ఆ తర్వాత ఆ మెంబర్ షిప్ కాల పరిమితిని ఏడాదికి పొడిగించారు. ఈ ప్లాన్ కింద ఫ్రీ బెనిఫెట్స్ ఏడాది పూర్తికాగానే నిలిచిపోతాయి.

ఆటో ఫ్రీ రెన్యూవల్ ద్వారా మెంబర్ షిప్ ను రెండుసార్లు యాక్టివేట్ చేసుకోవచ్చు. తద్వారా మరో ఏడాది వరకు అదనంగా ఫ్రీ బెనిఫెట్స్ పొందవచ్చు. మీరు జియో ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లు అయితే.. ఏడాది ఫ్రీ యాక్సస్ కాల పరిమితి ముగిసిందా? మీ సబ్ స్ర్కిప్షన్ ఆటో రెన్యువల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి.

జియో ప్రైమ్.. ఆటో రెన్యూవల్ చెక్ చేసుకోవాలంటే :
* మై జియో యాప్ ఓపెన్ చేయండి.
* యాప్ లో మెనూ ఆప్షన్ లెఫ్ట్ కార్నర్ ను ట్యాప్ చేయండి.
* మై ప్లాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది.. యాడ్ ఆన్ ప్యాక్స్ 
* జియో ప్రైమ్ మెంబర్ షిప్ ట్యాబ్ ఉంటుంది.. క్లిక్ చేయండి.

ఒకవేళ.. మీ జియో ప్రైమ్ మెంబర్ షిప్ రెన్యూవల్ అయి ఉంటే.. మీకు ఓ మెసేజ్ కనిపిస్తుంది. ‘యువర్ రిక్వెస్ట్ టూ అవైల్ జియో ప్రైమ్ మెంబర్ షిప్ ఫర్ ఏ ఇయర్ యాజ్ బీన్ రిజిస్ట్రర్డ్ సక్సెస్ ఫుల్లీ’ అని మెసేజ్ ఉంటుంది. అంటే.. ఇక నుంచి జియో యూజర్లు.. రెండో ఏడాది కూడా జియో ప్రైమ్ బెనిఫెట్స్ ను ఎంజాయ్ చేయవచ్చు. 

reliance jio
auto-renew
Prime membership
free
Prime customers   

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు