వరి ఇరగపండింది : పాడి పంటల తెలంగాణ

Submitted on 23 January 2019
Recorded in rice crop : 'Telangana' trainers who break the record of 20 years

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ పంటలో వరి సిరులు కురిపించింది. 20 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసింది. రైతు కళ్లలో ఆనందం చూడాలనే సీఎం కేసీఆర్ కలకు ప్రాణం పోసుకుంటోంది తెలంగాణ. ఈ సీజన్‌లో పాత రికార్డులను బద్దలు కొడుతూ.. రైతుల పాడి పంటలు పండించారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల సరఫరా విషయంలో తగిన చర్యలు తీసుకోవటంతో ఈ ఖరీఫ్ పంటలో దిగుబడి బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. పంటల దిగుబడిపై 2018–19 ఖరీఫ్‌ పంటల దిగుబడి, ఉత్పాదకతపై అర్థగణాంక శాఖ అధికారులతో వ్యవసాయ శాఖ కీలక సమావేశం నిర్వహించింది. అందులో పంటల దిగుబడిపై చర్చ జరిగింది. ఖరీఫ్‌లో ఏకంగా 61 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. 20 ఏళ్లలో ఇంతటి వరి ధాన్యం దిగుబడి ఎప్పుడూ రాలేదని స్వయంగా వ్యవసాయ శాఖ అధికారులే తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వం అధికారికంగా త్వరలో విడుదల చేయనుంది. 2017–18 ఖరీఫ్‌ దిగుబడి కంటే ఏకంగా రెట్టింపు స్థాయిలో ఈ సారి వరి దిగుబడి వచ్చింది. 2017–18 ఖరీఫ్‌లో వరి దిగుబడి 30.42 లక్షల టన్నులే ఉంది.  

అంచనాలను మించిన సాగు..పెరిగిన ఉత్పత్తి..
2018–19 ఖరీఫ్‌లో వరి అంచనాలకు మించి సాగు జరిగింది. ఈ క్రమంలో వరి పంట  ఏకంగా 107 శాతానికి  చేరుకుంది. ఖరీఫ్‌ వరి సాధారణ సాగు కంటే విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 25.44 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఉత్పాదకత శక్తి కూడా ఎక్కువ శాతం  పెరిగింది. దీంతో  ఎకరాకు 20 క్వింటాళ్లపైనే దిగుబడి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. దీనికి కారణాలు ఎన్నో వున్నాయి. వరి పొలంలో ఎప్పుడు అవసరానికి మించిన స్థాయిలో నీరు ఉండేది. వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం రైతులు ఈ ఖరీఫ్  పంటలో వరి పొలంలో అప్పుడప్పుడు..అవసరానికి తగినట్లుగా తడి పెట్టారు. దీనివల్ల వరికి పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ అందటంతో ఫలితంగా వరి గింజ గట్టి పడటం..దాని బరువు కూడా పెరటంతో  దిగుబడి పెరిగిందని ఓ అధికారి విశ్లేషించారు. వరిలో ఎంపిక చేసిన  విత్తనాలను  రైతులకు అందజేయటంతో వాటితో కూడా దిగుబడి పెంచేందుకు దోహదం చేశాయని ముఖ్యంగా కునారం సన్నాలు, తెలంగాణ సోన విత్తనాలను జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రైతులకు లక్ష క్వింటాళ్ల విత్తనాలను అందజేశామని తెలిపారు. 

నిపుణుల సూచనలతో తప్పిన ముప్పు..పెరిగిన పంట దిగుబడి
సరైన సమయంలో నాట్లు వేయటం..వాటికి కావాల్సిన ఎరువులు వేప పూత,  యూరియా సరఫరా అన్నీ సరైన సమయంలో సరఫరా చేయటం వల్ల కూడా  పంట దిగుబడి పెరిగిందని తెలిపారు. అలాగే ఈ ఖరీఫ్ పంటలో పెద్దగా చీడపీడల బాధ కూడా లేదనీ వీటి ఫలితంగా వరి పంట దిగుబడికి ప్రధాన కారణమని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి విశ్లేషించారు.  వరి పంటే కాకుండా తక్కిన పంటల దిగుబడి పెంచేలా ఓ నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వరి ఖరీఫ్‌కు సంబంధించి మొదటి అంచనా నివేదిక ప్రకారం గత ఖరీఫ్‌లో పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 4.03 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, 3.74 లక్షల టన్నులు మాత్రం దిగుబడి వచ్చే అవకాశముంది. గులాబీ పురుగు తదితర కారణాల వల్ల పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయే పరిస్థితి ఉండటంతో దాన్ని అధిగమించేలా చర్యలు తీసుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. 

 

Telangana
Agriculture Department
Jayashankar Agricultural University
Chief Secretary
C.Pardasarathi

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు