అదిరిపోయే ఫీచర్లు : Realme 3 Pro వచ్చేసింది

Submitted on 22 April 2019
Realme 3 Pro to launch in India today price, specifications

రియల్ మి స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇండియన్ మార్కెట్లోకి ఒప్పో సబ్ బ్రాండ్ Realme నుంచి మరో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే.. రియల్ మి 3 ప్రొ. సోమవారం (ఏప్రిల్ 22, 2019) మధ్యాహ్నం 12.30గంటలకు ఢిల్లీలో రిలీజ్ అయింది. ఇప్పటికే మొబైల్ మార్కెట్లలో విడుదలైన రియల్ మి 3 సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read : కోట్ల మందికి ఇదే దిక్కు : 123456.. మీ పాస్‌వ‌ర్డ్‌ మాకు తెలుసు

రియల్ మి 3 ప్రొ సిరీస్ రిలీజ్ కు ముందే ఇటీవల ఢిల్లీ యూనివర్శిటీ క్యాంపస్ లో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్.. రియల్ మి3 ప్రొ డివైజ్ లోని స్పెషిఫికేషన్లు, ఫీచర్లను రివీల్ చేయగా.. స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లలో సేల్స్ సునామీ సృష్టిస్తున్న ఇతర బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు పోటీగా మిడ్ రేంజ్ సిగ్మంట్ స్మార్ట్ ఫోన్ గా రియల్ మి సిరీస్ ను రిలీజ్ చేశారు. 

రియల్ మి 3 ప్రొ సిరీస్ ధర ఎంతో తెలుసా? రూ.13వేల 999. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒక వేరియంట్ లో 4GB ర్యామ్, 64GB ఇంట్నరల్ స్టోరేజీ ఉంది. రెండో వేరియంట్ డివైజ్ లో 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం ఉంది.

ఈ వేరియంట్ ధర రూ.16వేల 999. స్మార్ట్ ఫోన్ యూజర్లకు రిలయ్ మి3 ప్రొ కార్బన్ గ్రే, నిట్రో బ్లూ, లైటనింగ్ పర్పల్ మూడు కలర్లలో లభ్యం కానుంది. వెనుక భాగంలో ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 20W Vooc 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్, రియల్ మి అధికారిక వెబ్ సైట్లో ఏప్రిల్ 29 నుంచి సేల్ ప్రారంభం కానుంది. 

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఇవే :
* 6.3 అంగుళాల LCD 2.5D కర్వడ్ డిసిప్లే
* FHD+ (2340*1080 ఫిక్సల్స్) రెజుల్యూషన్
* గొర్లిల్లా గ్లాస్ 5 ప్యానెల్
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 710ఎస్ఓసీ
* ఆక్టా కోర్ CPU, 2.2GHz
* ఎడ్రినో 616 GPU
* మైక్రో SD కార్డ్ (256GB కెపాసిటీ)
* డ్యుయల్ కెమెరా, 16MP ప్రైమరీ సెన్సార్ 
* సెకండరీ 5 మెగాఫిక్సల్ సెన్సార్
* ఫ్రంట్ కెమెరా : 25 మెగాఫిక్సల్ కెమెరా సెన్సార్, ఎఫ్/2.0 అప్రెచర్
* VoLTE 4G డ్యుయల్ నానో సిమ్ స్లాట్
* బ్లూటూత్ v5.0
* Wi-Fi, GPS, 3.5mm ఆడియో సాకెట్ 
* మైక్రో USB పోర్ట్
* ఆండ్రాయిడ్ 9 పై, కలర్OS 6.0
* 4,045mAh బ్యాటరీ 

Also Read : ఐపీఎల్ ఫైనల్ హైదరాబాద్‌లో.. మే12న

Realme 3 Pro
specification
Realme 3 Pro price
64MP Ultra HD mode

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు