సెన్సార్ కట్స్ చెప్పింది - రివైజ్ కమిటీ రిలీజ్ చేసుకోమంది..

Submitted on 22 February 2020
Realistic Crime Drama Palasa 1978  Releasing on March 6th

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మార్చి 6న రిలీజ్ చేయనున్నారు. విడుదలకు ముందే ఇండస్ట్రీ‌లో హాట్ టాపిక్‌గా మారిందీ మూవీ. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ మెంబెర్స్ ప్రశంసలు పొందింది. 

ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ : "సెన్సార్ బోర్డ్ ఎక్కువ కట్స్ సూచించడంతో రివైజ్ కమీటీకి వెళ్ళాం. అక్కడ" పలాస 1978" చూసిన బృందం ఈ సినిమాను ప్రశంసించారు. వారికి నా ధన్యవాదాలు. ఇప్పటికే, ఈ సినిమా ప్రివ్యూ చూసిన వారు ఇస్తున్న స్పందన నాకు మరింత బలాన్ని ఇచ్చింది. తెలుగు సినిమాల్లో  "పలాస 1978" భిన్న మైనది అని కచ్చితంగా చెప్పగలను. రైటర్‌గా ఉన్న నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్. ఈ సినిమాకు కథ నుండి రిలీజ్ వరకూ మాకు అండగా నిలిచిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి చాలా థ్యాంక్స్. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవడం చాలా ఆనందం గా ఉంది" అన్నారు. 

విజయవాడ, గుంటూరుల్లో జరిపిన ప్రమోషన్స్ టూర్స్‌కి విశేష స్పందన వచ్చింది. రఘు కుంచె మ్యూజిక్ అందించడమే కాకుండా ఇక కీలక పాత్రను పోషించారు. శ్రీకాకుళం జానపదం నుండి తీసుకున్న' నీ పక్కన పడ్డాదిరో చూడర పిల్లా..నాది నక్కీ లీసు గొలుసు' పాట సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతుంది. ఈ సినిమా చూసి బాగా నచ్చి" మీడియా 9 మనోజ్" రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్‌ని ఫ్యాన్సీ రేట్‌కి సొంతం చేసుకున్నారు. 

 రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి  పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె, కో- ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్, నిర్మాత : ధ్యాన్ అట్లూరి, రచన-దర్శకత్వం : కరుణ కుమార్.

Realistic Crime Drama Palasa 1978  Releasing on March 6th

Palasa 1978
March 6th 2020
Rakshit
Nakshatra
Raghu kunche
Dhayan Atluri
Karuna Kumar

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు