రష్మీ శివరంజని ట్రైలర్

Submitted on 15 May 2019
Rashmi Shivaranjani Movie Trailer

రష్మీ, నందు, ధనరాజ్, ఢిల్లీ రాజేశ్వరి ప్రధాన పాత్రధారులుగా, నల్లా స్వామి సమర్పణలో, యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, ఎ.పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు నిర్మిస్తున్న సినిమా.. శివరంజని. హారర్ కమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి నాగ ప్రభాకర్ దర్శకుడు. రీసెంట్‌గా శివరంజని ట్రైలర్ రిలీజ్ చేసారు.

ఒక యాక్సిడెంట్‌లో రష్మీ గతం మర్చిపోవడం, ఆమెని ఒక నీడ వెంటాడడం, అది నీడ కాదు దెయ్యం అని నిర్దారించుకోవడం వంటివి ట్రైలర్‌లో చూపించారు. కాష్మోరా నుండి ప్రేమకథా చిత్రమ్ వరకూ రకరకాల జానర్స్‌కి చెందిన హారర్ సినిమాలు చూసాం కాబట్టి ఈ కాన్సెప్ట్, ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోవు.

ఈ సినిమాకి కెమెరా : టి.సురేంద్ర రెడ్డి, ఎడిటింగ్ : ఉపేంద్ర, సంగీతం : శేఖర్ చంద్ర, డైలాగ్స్ : వై.సురేష్ కుమార్, సహ నిర్మాత : కటకం.వాసు.

వాచ్ ట్రైలర్..

Nandu
Dhanraj
Rashmi Gautam
Sekhar Chandra
Naaga Prabhakkar

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు