రమేష్ (ఐమ్యాక్స్) ప్రసాద్‌కు సతీ వియోగం

Submitted on 17 October 2019
Ramesh Prasad's wife Vijayalakshmi Pasess away

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి, శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి గురువారం ఉదయం పరమపదించారు. హార్ట్ ఎటాక్ కారణంగా రాత్రి నిద్రలో తుదిశ్వాస విడిచారు.

ఆమె వయసు 77 సంవత్సరాలు. ఆమె మద్రాసులో జన్మించారు. రమేష్ ప్రసాద్‌తో 1963 జూలైలో విజయలక్ష్మీ వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.

Read Also : భార్యతో విడాకులు .. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Ramesh Prasad
Imax Prasad
Vijayalakshmi
Ramesh Prasad's wife Pasess away

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు