వైరల్ అయిన ఫొటో కథ చెప్పిన రామ్‌చరణ్

Submitted on 14 March 2019
RamCharan Explains About Movie and First Sitting

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన రూమర్లు అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేందుకు రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సంధర్భంగా రామ్‌చరణ్ ఈ సినిమా అసలు ఎలా మొదలైంది కాంబినేషన్ ఎలా సెట్ అయింది అనే విషయాలతో పాటు సోఫాలో రాజమౌళి మధ్యలో కూర్చోగా, అటూ ఇటూ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కూర్చున్న ఫోటోకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలిపారు.  ఎయిర్ పోర్టుకు వెళ్లేదారిలో రాజమౌళి హౌస్ ఉందని వెళ్తే అక్కడ అప్పటికే ఎన్టీఆర్ నేల మీద కూర్చొని రిలాక్స్‌గా ఉన్నాడు. ఈయన ఉన్నాడు ఏంటి? ఇక్కడ అనుకున్నాను. 
Read Also : #RRR మూవీ : రిలీజ్ డేట్ ఫిక్స్, బడ్జెట్ ఎంతో చెప్పేశారు

నన్ను చూసిన తారక్.. హాయ్.. బ్రో.. మీరిద్దరు ఏమైనా మాట్లాడుకోవాలా? నేను బయటకు వెళ్తాను అన్నాడు. లేదు.. నాకు ఫ్లైట్‌కు టైం ఉంది మీరు మాట్లాడుకోండి అని బయటకు వెళ్తుంటే.. రాజమౌళి ఇద్దరినీ తీసుకుని ఒక గదిలోకి తీసుకెళ్లి సినిమా కథ చెప్పారని అన్నారు.
Read Also : #RRR మూవీ అద్భుతంగా ఉంటుంది : ఎన్టీఆర్

అప్పుటివరకు రాజమౌళి సినిమా తీస్తాడు అని ఇద్దరికీ తెలియదు అని, అంత చక్కగా ఆయన కథ చెప్పడం, వెంటనే మా ఇద్దరి మొహాలనూ ఒకరిని ఒకరం చూసుకుని, వెంటనే లేచి, గట్టగా ఆయన్ను పట్టుకుని 'మోర్ దేన్ హ్యాపీ టూ వర్క్' అని ఒకేసారి చెప్పి, ఫోటో దిగి వచ్చామని తెలిపారు. అదే ఫోటో ఫస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పారు. 
Read Also : అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిస్తే #RRR మూవీ

RRR
ramcharan
 DVV Dhanayya
Rajamouli
NTR

మరిన్ని వార్తలు