ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ : ఇన్‌స్టాగ్రామ్ లో చెర్రీ

Submitted on 10 July 2019
Ram Charan Makes Grand Debut On Instagram, Gets 50k Followers In 5 Hours

సెలబ్రిటీలు అంతా ఈ మద్య ఎక్కువగా వాడుతున్న సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్. ఇప్పటి వరకు జాయిన్ అవ్వని స్టార్లు కూడా ఇన్‌స్టాలో జాయిన్ అవుతున్నారు. తమ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్నారు. అంతెందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్ కూడా రీసెంట్ గా ఇన్‌స్టాలో జాయిన్ అయ్యాడు. ప్రభాస్ తో పాటుగా మరికోందరు సెలబ్రిటీలు కూడా ఇన్‌స్టాలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆ జాబితాలో చేరాడు. 

ఇన్‌స్టాగ్రామ్ లో జాయిన్ అయిన చెర్రీ శుక్రవారం (జూలై 8, 2019) తను నటించిన సూపర్ హిట్ మూవీ 'రంగస్థలం' లో గడ్డం లుక్‌తో ఉన్న తన ఫోటోను షేర్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ లో జాయిన్ అవ్వటంపట్ల చెర్రీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ లో ఇవాళ (జులై -10, 2019) తన ఫస్ట్ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. @alwaysramcharan పేరుతో ఈ అకౌంట్ ఉంది. అకౌంట్ ఓపెన్ చేసిన 5 గంటల్లోనే 50వేల మందికిపైగా చెర్రీని ఫాలో అవ్వడం విశేషం. ఈ స్పీడు చూస్తుంటే ఒకటి రెండు రోజుల్లోనే చెర్రీ ఫాలోవర్స్ 1 మిలియన్ రీచ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

హీరోల కన్నా హీరోయిన్స్ కే ఫాలోయింగ్ ఎక్కువ. హీరోయిన్స్ లో 6.4 మిలియన్ల మంది ఫాలోవర్స్  ఉన్న పూజాహెగ్డే కూడా వాష్టింగన్ టూర్ పిక్స్ పెట్టింది. ఇక కియారాకి కూడా ఆల్ మోస్ట్ 6.1 ఫాలోవర్ల్స్ ఉన్నారు. రీసెంట్ గా కబీర్ సింగ్ కలెక్షన్లకు సంబందించి పిక్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ఈ క్యూట్ హీరోయిన్. 

Ram Charan
Grand Debut On Instagram
Gets 50k Followers
In 5 Hours


మరిన్ని వార్తలు