ప్రభాస్, మహేష్ మల్టీస్టారర్ - జక్కన్న మరో చరిత్రకు శ్రీకారం!

Submitted on 18 February 2020
Rajamouli Multistarrer with Mahesh Babu and Prabhas?

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘RRR’ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. బ్యాలెన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుండడంతో జక్కన్న టీమ్ అంతా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఒక సినిమా పూర్తయితే కానీ మరో సినిమాపై దృష్టి పెట్టని రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ జరుగుతుండగానే తర్వాతి సినిమాకు సంబంధించిన సన్నాహాల్లో ఉన్నాడని తెలుస్తోంది. అంతేకాదు.. రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో మల్టీస్టారర్ ప్లాన్ చేయనున్నాడట రాజమౌళి.. బాహుబలి లెవల్లో, పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రం గురించి ఇప్పటికే డిస్కషన్ జరిగిందని, ప్రభాస్, మహేష్ ఇద్దరూ కూడా ఒకే చెప్పారని తెలుస్తోంది.

 దుర్గా ఆర్ట్స్ అధినేత్ కేఎల్ నారాయణ నిర్మాతగా రాజమౌళి గతంలో ఓ చిత్రాన్ని అంగీకరించారు. ఈ సినిమాకు ఆయనే నిర్మాత అని ఫిలింనగర్ టాక్. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఇదేనని, ఈ మూవీలో ప్రభాస్ కూడా ఉంటారని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా నిర్మాణంలో భాగమవుతుందని తెలుస్తోంది.

రాజమౌళితో సినిమా ఉంటుందని ‘మహర్షి’ ప్రమోషన్స్‌లో స్వయంగా మహేష్ చెప్పాడు. దీన్ని బట్టి ఈ వార్త నిజమనే అనుకోవచ్చు. కాంబినేషన్ వగైరా అన్నీ నమ్మశక్యంగానే ఉన్నాయి కానీ, అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్, వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా మే నుంచి పట్టాలెక్కనుంది.
 

S S Rajamouli
Prabhas
Mahesh Babu
multistarrer
KL Narayana

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు