బీ కేర్ ఫుల్ : ఏపీలోని ఆ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన

Submitted on 21 October 2019
rain alert for ap

ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 23న దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రానున్న మూడు రోజులు ఏపీకి వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని చోట్ల భారీగా, కొన్ని చోట్ల మోస్తరు వానలు పడతాయని చెప్పారు. ఏపీలోని 7 జిల్లాల్లో కుండపోత వానలు పడతాయని చెప్పారు.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వానలు దంచికొడతాయని చెప్పారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోనూ పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని దీనికి అనుబంధముగా 4.5 కి.మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అదే విధంగా తూర్పుమధ్య అరేబియా సముద్రం నుండి విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కి. మీ.ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల మరో మూడు రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.

Rains
Floods
AP
7 districts
Weather
alert

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు