రైల్వే పోలీసుల రౌడీయిజం...జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి దాడి

Submitted on 12 June 2019
Railway Police Attacking on journalist in uttar pradesh

ఉత్తర్‌ప్రదేశ్‌లో రైల్వే పోలీసులు రెచ్చిపోయారు. న్యూస్ కవరేజ్‌ కోసం వెళ్లిన ఓ జర్నలిస్టుపై దాడి చేశారు.  ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. పిడిగుద్దులతో వీధి రౌడీల కంటే దారుణంగా ప్రవర్తించారు. జర్నలిస్ట్ పై భౌతిక దాడి చేయడమే కాకుండా....ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టారు. యూపీలోని ధిమన్‌పురాలో ఈ ఘటన జరిగింది.

మంగళవారం(జూన్-11,2019) రాత్రి షామిలిలోని ధిమన్‌ పురా దగ్గర్లో  గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో స్థానికంగా ఉండే ఓ విలేకరి ఘటనా స్థలానికి వెళ్లాడు. అసలేం జరిగిందో రైల్వే అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన షామిలీ GRP SHO రాకేష్ కుమార్,అతని సహ ఉద్యోగులు అతడిపై దాడికి దిగారు. కెమెరాను లాక్కుని నేలకు విసిరికొట్టారు. మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ పాత్రికేయుడ్ని చితకబాదారు. అతడిపై పిడిగుద్దులు కురిపించారు.

అంతేకాకుండా తనను బంధించి... నోట్లో మూత్రం పోశారని బాధిత జర్నలిస్టు వాపోయాడు. జర్నలిస్టుపై రైల్వే పోలీసుల దాడి వీడియో వైరల్ గా మారింది.జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.SHO రాకేష్ కుమార్,కానిస్టేబుల్ సంజయ్ పవార్ ను సస్పెండ్ చేశారు.

UP
Railway Police
GRP
SHO
SHAMILI
RAKESH KUMAR
journalist
attacked
abused
URINATED
MOUTH
suspend

మరిన్ని వార్తలు