తండ్రికి తగ్గ తనయుడు : 2నెలల్లో మళ్లీ డబుల్ సెంచరీ

Submitted on 19 February 2020
Rahul Dravid's son Samit another doubel hundred

రాహుల్ ద్రవిడ్.. క్రికెట్ ఫ్యాన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. ఆటలో నిలకడకు మారు పేరు. ద వాల్ అని ముద్దుగా పిలుస్తారు. క్రీజులో ఒక్కసారి నిలదొక్కుకున్నాడంటే.. ఇక వెనుదిరిగి చూడడు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు.. ద్రవిడ్ కొడుకు సమిత్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. అద్భుతమైన ఆటతో తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు. ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ మరోసారి డబుల్ సెంచరీతో చెలరేగాడు. జూనియర్ క్రికెట్‌లో 2019 డిసెంబర్ లో ద్విశతకం బాదిన సమిత్.. తాజాగా అండర్-14 బీటీఆర్ షీల్డ్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. బ్యాట్‌తోనే కాదు.. బౌలింగ్‌లోనూ సత్తాచాటిన ఈ చిచ్చర పిడుగు 2 వికెట్లు పడగొట్టి.. ఒంటిచేత్తో టీమ్‌కి విజయాన్ని అందించాడు. 2 నెలల వ్యవధిలోనే సమిత్.. రెండో డబుల్ బాదడం విశేషం. 

మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ తరఫున బరిలోకి దిగిన సమిత్ ద్రవిడ్ 33 ఫోర్ల సాయంతో 204 పరుగులు చేశాడు. దీంతో.. మాల్యా టీమ్ 3 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. చేజింగ్ లో తడబడిన శ్రీ కుమారన్ టీమ్.. 110 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్ తో అదరగొట్టిన సమిత్.. బౌలింగ్ లోనూ మాయ చేశాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. 267 పరుగుల తేడాతో మాల్యా టీమ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

2019 డిసెంబర్ లో అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ టీమ్ తరఫున ఆడిన సమిత్ ద్రవిడ్.. 256 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 201 పరుగులు చేశాడు. ఇప్పుడు మరో డబుల్ బాదాడు. కేవలం 60 రోజుల వ్యవధిలోనే సమిత్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు చేసి శభాష్ అనిపించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అని అంతా కితాబిస్తున్నారు.

2016లో బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడిన సమిత్.. వార్తల్లోకి ఎక్కాడు. ఆ మ్యాచ్ లో ఫ్రాంకీ ఆంటోనీ పబ్లిక్ స్కూల్ తరఫున ఆడిన సమిత్.. 125 పరుగులు చేశాడు. ప్రత్యూష్ (143) తో కలిసి 4వ వికెట్ కి 213 పరుగులు జోడించాడు. ఆ మ్యాచ్ లో ఆంటోనీ పబ్లిక్ స్కూల్ 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చూస్తుంటే.. సమిత్.. తండ్రి రాహుల్ ద్రవిడ్ బాటలో పయనిస్తూ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తండ్రిలాగే అద్భుతమైన ఆటతీరు, నిలకడ చూపిస్తున్నాడని కితాబిస్తున్నారు. భారత జట్టు ప్లేయర్లలో గ్రేటెస్ట్ ఎవర్ బ్యాట్స్ మన్ గా రాహుల్ కు గుర్తింపు ఉంది. నెంబర్ 3 పొజిషన్ లో రాహుల్ ఆడాడు. 16ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో టెస్టుల్లో 13వేల 288 పరుగులు, వన్డేల్లో 10వేల 889 రన్స్ చేశాడు. 

2 double hundreds
2 months
rahul dravid
Son
Samit dravid
doubel century
under 14 cricket
double hundred
Double Century

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు