కారణం అదే : ప్రియాంక, నిక్ జోనస్ విడాకులు?

Submitted on 30 March 2019
Priyanka Chopra And Nick Jonas Going To Take Diverce Soon

ఆమె ఇండియన్ హీరోయిన్.. అతను హాలీవుడ్ సింగర్. ఆమె వయసు 36.. అతని వయసు 26. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది కలిసిమెలిసి ఉంటారనుకుంటే.. ఇప్పుడు సడెన్ గా విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఆ ఇద్దరూ ఎవరు..?  2018 డిసెంబర్ 1, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ జోనస్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఇండియన్ అమ్మాయికి.. ఇంగ్లీష్ అబ్బాయికి జోడీ కుదిరిందని అంతా సంబరపడ్డారు.
Read Also : బాబోయ్.. బిల్లు కట్టేదెట్టా : కేబుల్, డీటీహెచ్ ఛానళ్లు వెరీ కాస్ట్‌లీ

నాలుగు నెలలు కూడా కాకముందే ప్రియాంక, నిక్ పెళ్లి పెటాకులయ్యేలా ఉందని ఇంగ్లీష్ మీడియా కోడై కూస్తోంది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వైవాహిక జీవితంపై.. ఓ అమెరికన్ మ్యాగజైన్ రీసెంట్ గా ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో ప్రియాంక, నిక్ దాంపత్య జీవితం అంత సాఫీగా ఏం సాగడం లేదని రాసుకొచ్చింది. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని చెబుతోంది. త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ పెద్ద పెద్ద రాతలు రాసేసింది. అంతేకాదు.. నిక్ ఫ్యామిలీ కూడా వీలైనంత త్వరగా ప్రియాంకతో తెగతెంపులు చేసుకోవాలని ట్రై చేస్తున్నట్లు తెలిపింది. 

ప్రియాంక, నిక్ మధ్య గొడవలు రావడానికి రీజన్స్ కూడా ఇంగ్లీష్ మ్యాగజైన్ లో వివరంగా రాశారు. పెళ్లికి ముందు నిక్ జీవితం చాలా సాఫీగా సాగిపోయేదని.. పెళ్లి తర్వాత నిక్ మీద ప్రియాంక పెత్తనం పెరిగిందనేది ఓ కారణం. అందుకే తరుచూ గొడవలు జరుగుతున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోకుండానే తొందరపడి పెళ్లి చేసుకున్నారని చెబుతోంది. దీంతో ఇప్పుడు గొడవలు అవుతున్నాయని ప్రచురించింది. మరి ఈ వార్తలపై.. ప్రియాంక, నిక్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Also : మజిలీ నుంచి 'వ‌న్ బాయ్ వ‌న్ గార్ల్' లిరికల్ సాంగ్

Priyanka Chopra
Nick Jonas
Take Diverce Soon
2019

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు