పంచాయితీ ఎన్నికలు: 60 ఏళ్ల తర్వాత సీన్ మారింది

Submitted on 12 January 2019
President's post from 60 years Unanimous But now scene reverse


లెత్దూరుపల్లి :  ఆరు దశాబ్దాలుగా ఆ గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగలేదు. ఎప్పుడూ ఏకగ్రీవమే. చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలకూ ఆ వూరు ఇంతకాలం ఆదర్శం. ఆ ఊరిని చూసి ఇప్పుడూ ఎన్నో ఊళ్లు ఏకగ్రీవాలవుతున్నాయి.. కానీ.. ఆ ఊరిలో మాత్రం పరిస్థితి మారిపోయింది. ఈ సారి ఎన్నికలకు సై అంటోంది. సర్పంచ్‌ పదవి కోసం ఈసారి ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏర్పడ్డ పోటీ.. ఆ ఊరి చరిత్రనే మార్చేయబోతోంది. ఇంతకీ ఆ ఊరేదో తెలుసా..ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి. 

ఖమ్మం రూరల్‌  మండలంలోని తెల్దారుపల్లి గ్రామం. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంతూరిది.  పంచాయతీరాజ్‌ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఎప్పుడూ ఎన్నికలు జరిగిందే లేదు. ఊరంతా ఒక్కతాటిపై నిలబడి సర్పంచ్‌ను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వచ్చింది. ఇప్పుడు తొలిసారిగా  ఈ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. సీపీఎంలో విభేదాలే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. 

గతంలో ఎస్టీ, ఎస్సీ, బీసీలు ప్రాతినిధ్యం వహించిన తర్వాత సంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పుడు పోటీకి సై అంటోంది ఆ ఊరు.సీపీఎం నాయకుల్లోని విభేదాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గత నెల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి తెల్దారుపల్లిలో ఓట్లు పడటంతో తమ్మినేని సోదరులు కృష్ణయ్య, కోటేశ్వర్‌రావులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత తమ్మినేని వీరభద్రం గ్రామానికి వచ్చి... అందరికీ నచ్చచెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో  తమ్మినేని వీరభద్రం సోదరుల్లో ఒకరైన తమ్మినేని వెంకట్రావ్‌ పేరును సీపీఎం గ్రామ కమిటీ ప్రతిపాదించింది. అయితే గ్రామ ప్రజలకు ఎప్పటి నుంచే అందుబాటులో ఉంటూ... సమస్యలు పరిష్కరిస్తున్న తమ్మినేని కృష్ణయ్యను కాదని.. వెంకట్రావ్‌ పేరును తెరపైకి తీసుకురావడంతో... సీపీఎం నాయకుల్లో  మళ్లీ విభేదాలు తలెత్తాయి. గ్రామంలో నివాసం ఉండని వెంకట్రావ్‌ను పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో తమ్మినేని వెంకట్రావుకు బదులు సీపీఎం అభ్యర్థిగా తమ్మినేని కోటేశ్వర్‌రావును నిర్ణయించడంతో ఆయన నామినేషన్‌ వేయగా...  తమ్మినేని కృష్ణయ్య ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. 


తమ్మినేని కృష్ణయ్య నామినేషన్‌ వేయడం వెనుక రాజకీయ కట్ర ఉందని సీపీఎం అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన తమ్మినేని కోటేశ్వర్‌రావు ఆరోపిస్తుండగా..ఈ ఆరోపణలను కృష్ణయ్య ఖండించారు. ఏకగ్రీవ సంప్రదాయారికి విరుద్ధంగా సర్పంచ్‌ పదవి కోసం సారి ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడుతోండటంతో గ్రామంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. తన ఇద్దరు సోదరులు పోటీడటంతో వీరభద్రం మస్థాపానికి గురువుతున్నారు. ఏకగ్రీవ ఎన్నికలకు ప్రభుత్వం అందించిన నిధులతో అభివృద్ధి పథంలో దూసుకుపోయిన తెల్దారుపల్లిలో ఇప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన గ్రామస్థుల్లో ఏర్పడింది. 
 
 

Telangana
Khammam
Telundurpalli
panchayat elections
CPM
Thamineni Veerabhadram
Krishnaiah
Koteswara Rao
President
Position
Competition

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు