తిరుమలకు రాష్ట్రపతి...అనంతరం షార్ కి

Submitted on 11 July 2019
President Ram Nath Kovind to offer prayers at Tirumala on Sunday.

యావత్ దేశమే కాకుండా ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జలై-15,2019 తెల్లవారుజామున 2:51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి పంపనున్నారు.ఆదివారం(జులై-14,2019)ఉదయం 6:51గంటల నుంచి దీనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది.అయితే శుక్రవారం(జులై-12,2019)లాంచింగ్ రిహార్సల్ జరుగుతుంది.


ఈ ప్రయోగానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు.అర్ధరాత్రి తర్వాత ప్రయోగం చేపట్టనుండడంతో జులై- 14వ తేదీ షార్‌కు రాష్ట్రపతి రానున్నారు. నాలుగు రోజుల తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శుక్రవారం(జులై-12,2019)చెన్నై చేరుకుంటారు రాష్ట్రపతి కోవింద్.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాంచీపురం చేరుకుని వరదరాజ పెరుమాల్ ఆలయంలో అథి వరదార్ స్వామి దర్శనం చేసుకుంటారు.

శనివారం(జులై-13,2019)రాత్రికి తిరుపతి చేరుకుంటారు.భారీ భద్రత నడుమ రోడ్డు మార్గం ద్వారా తిరుమలకి చేరుకుంటారు.శనివారం రాత్రి తిరుమలలోనే బస చేసి ఆదివారం(జులై-14,2019)ఉదయం వెంకటేశ్వరస్వామి దర్శం చేసుకుంటారు.అనతంరం శ్రీహరికోటకు వెళతారు.చంద్రయాన్-2 ప్రయోగకార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగ తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరతారు.

AP
tamilnadu
Visit
kovind
CONFIRM
Tirumala
shar
ISRO
CHANDRAYAN-2


మరిన్ని వార్తలు