ప్రకాశం టీడీపీ రేసుగుర్రాలు వీళ్లే.. బాలకృష్ణ కారణంగా పూర్తిగా రాని క్లారిటీ!

Submitted on 15 March 2019
Prakasham District First List Fixed

తెలుగుదేశం పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితా విడుదల చేయగా అసంతృప్తులుగా ఉన్నవారిని బజ్జగించేందుకు శతవిధాల ప్రయత్నించి మెజారిటీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకంటించింది. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను..  ఎర్రగొండపాలెం, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి రెండు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.
Read Also: గుంటూరు జిల్లాలో 14సీట్లు ఖరారు: నారా లోకేష్ ఎంట్రీ.. రసవత్తరంగా రాజకీయం

దర్శి, కనిగిరి సీట్లకు సంబంధించి క్లారిటీ రాకపోవడంతో పార్టీ అభ్యర్ధులను ప్రకటించలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావును ఈసారి ఒంగోలు నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఆయన మాత్రం దర్శి అసెంబ్లీ టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబును కోరుతున్నారు. అలాగే ఉగ్రనరసింహరెడ్డిని దర్శి కానీ కనిగిరి నుంచి కానీ పోటీ చేయించాలని భావిస్తుండగా.. కనిగిరి నుంచి తన మిత్రుడు కదిరి బాబూరావుకు టిక్కెట్ ఇవ్వాలని బాలకృష్ణ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఏటూ తేల్చుకోలేకపోతుంది. ఈ రెండు స్థానాలపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
ఓసీలు- 07
ఎస్సీలు-03

ప్రకాశం జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు:
చీరాల - కరణం బలరాం 
సంతనూతలపాడు - బి. విజయ్ కుమార్ 
ఒంగోలు - దామచర్ల జనార్ధన్ 
కందుకూరు - పోతుల రామారావు 
కొండెపి - జీ.బీ.వీ స్వామి 
మార్కాపురం - కందుల నారాయణరెడ్డి 
గిద్దలూరు - ఎం అశోక్ రెడ్డి 
ఎర్రగొండపాలెం - బి. అజితారావు 
పర్చూరు - యెల్లూరి సాంబశివరావు 
అద్దంకి - గొట్టిపాటి రవి

ఖరారు కాని స్థానాలు:
దర్శి
కనిగిరి

Read Also: నెల్లూరు జిల్లా సిట్టింగ్‌లకు సీట్లు లేనట్లేనా? ఫస్ట్ లిస్ట్‌ ఇదే

Prakasham District
TDP
first list
Balakrishna

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు