అమ్మ అనాథ.. ఆమె దగ్గరే నేర్చుకున్నా.. మహేష్ అడగ్గానే డబ్బు పంపాడు..

prakash-raj-superb-words-about-mahesh-babu

తనకు సాయం చేసే శక్తి ఉంది.. శక్తి వంచన లేకుండా చేయాల్సిన వారికి సాయం చేస్తానని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా తన ఫామ్‌హౌస్‌లోనే లాక్ అయిపోయారాయన. అక్కడి నుండే పలువురికి సాయం చేస్తూ, విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తన ఫామ్‌హౌస్‌లో కొందరికి ఆశ్రయం కల్పించారు. తాజాగా ఓ టీవీ ఛానెల్ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను సాయం చేస్తున్నాననే విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదని, అది చూసి కొందరైనా స్ఫూర్తిపోంది ఇంకొకరికి సాయం చేస్తారనే భావంతోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని అన్నారు.

తన తల్లిని అనాథాశ్రమంలో చేరదీశారని, ఆమె నర్సుగా పనిచేస్తూ వచ్చే డబ్బుతోనే తనని చదివించారని, ఎవరైనా వచ్చి డబ్బు సాయమడిగితే తన దగ్గర లేకపోయినా చెవులకున్న పోగులు తీసి మరీ ఇచ్చేవారని.. మనం ఇస్తూ ఉంటే మనకీ వస్తూ ఉంటుందనే మాట ఆవిడ చెప్పడంతో తను కూడా ఇవ్వడం అలవాటు చేసుకున్నానని, అప్పు చేసైనా ఈ పనులు కొనసాగిస్తుంటానని, షూటింగులు స్టార్ట్ అయితే తిరిగి సంపాదించుకుంటానని చెప్పారు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి చాలామంది సాయం చేస్తామని ముందుకొచ్చారని, అలా ఓ సందర్భంలో తాను అడగ్గా మహేష్ బాబు కొంత డబ్బు పంపారని.. నిర్మాత అనిల్ సుంకర తదితరులు కూడా తమవంతు సాయమందించారని తెలిపారు ప్రకాష్ రాజ్.

మరిన్ని తాజా వార్తలు