ప్రభాస్ రికార్డ్ : ఒక్క పోస్ట్ పెట్టలేదు.. 7లక్షల మంది ఫాలోవర్స్

Submitted on 15 April 2019
Prabhas' Instagram Profile Has 7.5 Lakh Followers Without a Single Post

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ఇప్పటివరకు సోషల్  మీడియాలో అంత యాక్టీవ్‌గా లేరు. ప్రభాస్‌కు ఒక్క ఫేస్‌బుక్ అకౌంట్ మాత్రమే ఇప్పటివరకు ఉంది. అయితే ప్రభాస్ పేరుతో పలు ఫేక్ అకౌంట్‌‌లు ట్విట్టర్ ఇన్‌స్టాగ్రమ్‌లలో కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ సోషల్ మీడియాలో ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. సోషల్ మీడియా అకౌంట్ ఫాలోవర్లే స్టార్ల ఇమేజ్ కి కొలమానాలుగా మారిన పరిస్థితిలో ప్రభాస్ తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లోకి ప్రవేశించారు.

ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ఓపెన్ చేసి కనీసం ఒక్క పోస్ట్ కూడా  పెట్టకుండానే ప్రభాస్ ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌కి రూ.7.5లక్షలకు పైగా ఫాలోవర్స్ వచ్చేశారు. ఆ అకౌంట్‌కు కనీసం ప్రొఫైల్ పిక్చర్ కూడా లేకపోవడం విశేషం. అయితే కొన్నిరోజులుగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రమ్‌లోకి వస్తారంటూ ప్రచారం జరిగిన క్రమంలో www.instagram.com/actorprabhas ప్రోఫైల్‌కు భారీగా ఫాలోవర్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ప్రభాస్ పేరిట ఉన్నఒకే ఒక్క అఫిషియల్ అకౌంట్ ఫేస్‌బుక్ మాత్రమే ఈ ఫేస్‌బుక్ అకౌంట్‌కు ఇప్పటివరకు కోటీ మందికి పైగా(10,170,307) ఫాలోవర్లు ఉన్నారు. 
 

Prabhas
Instagram Profile
7.5 Lakh Followers
social media

మరిన్ని వార్తలు