జర్నలిస్ట్ పై కంగనా ఫైర్...క్షమాపణలు చెప్పిన నిర్మాతలు

Submitted on 10 July 2019
Post Kangana Ranaut's spat with PTI reporter, Balaji Motion Pictures issues apology to Entertainment Journalists' Guild

కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ నటించిన జడ్జ్ మెంటల్ హై క్యా సినిమా నిర్మాతలు ఓ జర్నలిస్ట్ కు క్షమాపణలు చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ మూవీలోని ఓ పాటను జులై-7,2019న ముంబైలో రిలీజ్ చేశారు. పాట విడుదల సందర్భంగా అక్కడున్నపీటీఐ జర్నలిస్టు జస్టిన్ రావ్ పై కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన ‘మణికర్ణిక’ సినిమాకు జస్టిన్ రావ్ తక్కువ రేటింగ్‌ ఇచ్చారని, సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాశాడని సమావేశంలో కంగనా ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. 
దీంతో కంగన క్షమాపణలు చెప్పాలని ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ జర్నలిస్ట్స్‌ గిల్డ్ ఆఫ్ ఇండియా’ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో కంగనను బహిష్కరిస్తామని, ఆమెకు సంబంధించి ఎటువంటి ప్రచారం చేయమని హెచ్చరించింది.దీంతో ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. సినిమా పాట విడుదల కార్యక్రమంలో వివాదం తలెత్తిన కారణంగా క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టం చేసింది. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. తమ సినిమా ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ జులై- 26,2019న విడుదల కాబోతోందని, మీడియా ఈ సంఘటనను మర్చిపోయి ఎప్పటిలాగే సహకరించాలని కోరింది.బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
అయితే కంగనా మాత్రం క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆమె సోదరి రంగోలి ట్వీట్‌ చేశారు. దేశ ద్రోహుల్ని, తప్పుడు వ్యక్తుల్ని కంగన సరైన మార్గంలో పెడుతుందని ఆమె అన్నారు. అయితే కంగన, రంగోలి తీరును నెటిజన్లు,సినీ అభిమానులు తప్పుపట్టారు.

Kangana Ranaut
pti journalist
fire
APPOLOGY
entertainment journalists's guild
boycott
balaji motion pictures


మరిన్ని వార్తలు