ప్రపంచంలోనే ఫస్ట్ : Paper Beer బాటిల్స్ వస్తున్నాయ్

Submitted on 15 October 2019
Popular Beer Brand Develops World's First 'Paper' Beer Bottles That Can Be Easily Recycled

బీర్ గ్లాస్ బాటిల్స్ పోయి త్వరలో పేపర్ బీర్ బాటిల్స్ రానున్నాయి. ఇక నుంచి పేపర్ బీర్ బాటిళ్లే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. బీర్ ప్రియుల కోసం పాపులర్ బీర్ బ్రాండ్.. పేపర్ బీర్ బాటిల్స్ ప్రవేశపెట్టనుంది. గ్లాస్ బాటిల్స్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో డెన్మార్క్ కు చెందిన పాపులర్ బీర్ బ్రాండ్, కోపెన్ హ్యాగెన్ ఆధారిత కంపెనీ కార్లెస్ బెర్గ్ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. తమ బీర్ బ్రాండ్ తయారీకి వాడే గ్లాసు బాటిల్స్ ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే తొలిసారిగా గ్లాస్ బాటిల్స్ స్థానంలో పేపర్ బాటిల్స్ తీసుకొచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. 

పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో.. గ్లాస్ వ్యర్థాలు కూడా అంతే ప్రమాదం. దీనికి సంబంధించి రెండు రీసెర్చ్ ప్రొటోటైప్ పేపర్ బాటిల్స్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం పేపర్ బాటిల్ తయారీపై ‘గ్రీన్ ఫైబర్ బాటిల్’ పేరుతో వర్క్ జరుగుతున్నట్టు తెలిపింది. మార్కెట్లో విక్రయించే తమ బీర్ స్టోరేజీ కంటైనర్లు సులభంగా పర్యావరణంలో కలిసిపోయేలా తయారు చేయనున్నట్టు పేర్కొంది. అవసరమైతే రీసైకిల్ చేసుకోవచ్చునని బీర్ బ్రాండ్ చెబుతోంది.

కార్లెస్ బెర్గ్ బాటిల్.. వుడ్ ఫైబర్ తో తయారు చేయాలని చూస్తోంది. ఇటీవల కోపెన్ హ్యాగెన్ లో జరిగిన కంపెనీ C40 వరల్డ్ మేయర్స్ సమ్మిట్ లో పేపర్ బాటిల్స్ ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. 2015లోనే ఈ ఐడియాను అమలు చేయాలని భావించిన కంపెనీ.. అప్పటినుంచి ప్యాకేజింగ్ నిపుణులు, ఎకడామిక్స్ నిపుణులతో చర్చిస్తోంది. ద్రవరూపంలో ఉండే రసాయనాల నిల్వకు వుడ్ కంటైనర్లు గొప్పగా పనిచేయవు. 

అలాంటి వుడ్ ఫైబర్ బాటిళ్లలో తమ బీర్ ను ఎలా నిల్వ చేయవచ్చో కంపెనీ రీసెర్చ్ చేస్తోంది. ఇందుకోసం రెండు ప్రొటోటైపులను క్రియేట్ చేసే పనిలో పడింది. రీసైకిల్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) పాలిమర్ ఫిల్మ్‌ను ఉపయోగించి బాటిల్‌కు లోపలి అవరోధాన్ని సృష్టించడం ప్రోటోటైప్‌లలో ఒకటి. మరో ప్రోటోటైపు.. 100శాతం జీవావరణానికి సంబంధించింది. పాలిథిలిన్ ఫ్యూరోనేట్ (PEF) పాలీమర్ ఫిల్మ్ ఉంటుంది.

అడవి, వ్యవసాయ వ్యర్థాల మాదిరిగా 100 శాతం తిరిగి పునరుత్పత్తి చేసుకునేలా ఉంటుంది. రీసైక్లింగ్ చేసినప్పటికీ కూడా అదనంగా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి కాదు. ప్రస్తుతం ఈ రెండు ప్రోటోటైపులు టెస్టింగ్ దశలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. కార్లెస్ బర్గ్ అధికారికంగా బీర్ పేపర్ బాటిళ్లను అతి త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 100 శాతం జీవావరణ ఆధారిత బాటిల్స్ ను ఉత్పత్తి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. 

Popular Beer
Beer Brand
Paper Beer Bottles
Easily Recycled
Green Fibre Bottle
Carlsberg

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు