వైరల్ వీడియో: ఫస్ట్ ‘టీ’ నెక్ట్స్ డ్యూటీ అంటున్నపోలీస్ గుర్రం

Submitted on 2 December 2019
Police Horse Refuses To Work Without His Cup Of Morning Tea in  Merseyside England

ఓ గుర్రం మార్నింగ్ మార్నింగ్ వేడి వేడి టీ తాగుతోంది. అదేంటి గుర్రం గుగ్గిళ్లు తింటుంది గానీ టీ తాగుతుందా..అనే డౌట్ వచ్చేసింది కదూ. అదే మరి ఆ గుర్రం స్పెషాలిటీ. ఇలా ఒకటీ రెండు సార్లు కాదు ఏకంగా 15 సంవత్సరాల నుంచి టీ తాగుతున్న ఆ  పోలీసు గుర్రం విశేషాలు. 

ఒక కప్పు వేడివేడి టీ తాగితే ఆ ఫీలింగే వేరు. మార్నింగ్ మార్నింగ్ ఏదన్నా పని మొదలు పెట్టాలంటే ఫ్రెష్ గా టీ నోట్లో పడాల్సిందే. మనుషులకు టీ తాగటం సహజం. కానీ గుర్రం టీ తాగటం విశేషమే. వేడివేడి టీ కోసం తహతహలాడిపోయే ఆ గుర్రం పేరు జాక్. జాక్ 15 ఏళ్లుగా ఇంగ్లాండ్‌లోని మెర్సిసైడ్ పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచేస్తోంది. రోజూ అది డ్యూటీకి వెళ్లే ముందు దానికి ఒక కప్పు టీ తాగాకే ముందుకు కదులుతుంది. టీ ఇవ్వని రోజున జాక్ అడుగు కూడా ముందుకు వేయదట. 

ఈ 20 ఏళ్ల జాక్ కు గుర్రానికి...గోరు వెచ్చటి పాలతో రెండు టీస్పూన్లు షుగర్ కలిపి... దాంట్లో కూల్ వాటర్ కలిపి టీ ఇస్తే జాక్ చక్కగా లొట్టలు వేసుకుంటూ జుర్రేసుకుంటుంది.  టీ పట్టికెళ్లి దాని ముందు పెట్టగానే జాక్ నాలికతో జుర్రేసుకంటుంది.

జాక్ కు టీ అలవాటు ఎలా అయ్యిందో కూడా తెలుసుకుందాం..తన రైడర్ తాగిన టీ కప్పులో కొద్దిగా టీ మిగిలిపోయింది. టీ తాగక అతను కప్పును అక్కడ పెట్టేశాడు. దాంట్లో కొద్దిగా ఉన్న టీని జాక్ తాగేసింది. మరి దానికి ఆ టేస్ట్ నచ్చిందో ఏమో.. ఇక అప్పటి నుంచీ ఎవరైనా టీ తాగితే కప్పు పక్కన పెట్టగానే మిగిలిన టీ తాగేస్తోంది. అది సిబ్బంది గమనించారు. 
దాంతో ఓ టీ కప్పు జాక్ ముందు పెడితే చక్కగా తాగేస్తోంది. దీంతో ప్రతి రోజూ తమతోపాటూ...జాక్ కు కూడా ఓ కప్పు టీ ఇస్తున్నారు. సాధారణంగా మనుషులు తాగే రెగ్యులర్ కప్పుల కంటే కాస్త పెద్ద కప్పును జాక్ కోసం కేటాయించారు. టీ తాగిన తర్వాత... ఫుల్ ఎనర్జీతో ఈ గుర్రం పరుగులు పెడుతోంది. జాక్‌తో కలిపి... ప్రస్తుతం అక్కడ 12 గుర్రాలున్నాయి. మిగతావి టీ తాగవు. రోజూ జాక్‌కి టెట్లీయక్ టీ ఇస్తున్నట్లు ట్విట్టర్‌లో వీడియో ట్వీట్ ద్వారా పోలీసులు తెలిపారు. 

Police Horse
Tea
Refuses
Work Without
Cup Of Morning Tea
england
Merseyside
Police
Department

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు