దేశాన్ని ప్రగతిబాట పట్టిస్తాం : NDA పార్లమెంటరీ పక్ష నేతగా మోడీ

Submitted on 25 May 2019
PM Modi Elected NDA Leader, Says "People Voted For Pro-Incumbency"

బీజేపీ నేతృత్వంలోని NDA పార్లమెంటరీ  పక్ష నేతగా మోడీని ఎన్నికయ్యారు.ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ లో శనివారం ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ పేరును శిరోమణి అకాళీదల్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ,  రాంవిలాస్‌ పాశ్వాన్, బిహార్ సీఎం నితీశ్‌ కుమార్, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు  బలపరిచారు. అనంతరం ఎన్డీఏ పక్ష ఎంపీలంతా బల్లలు చరిచి తమ ఆమోదం తెలిపారు. 

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ....ఆధునిక భారత్‌ దిశగా మనం ప్రయాణం ప్రారంభించాం. ఈ ప్రయాణంలో మీరంతా ఎంతో బాగా సహకరించారు. తొలిసారి లోక్‌ సభకు ఎన్నికైన వారందరికీ అభినందనలు.ప్రజలు మాపై మరోసారి భరోసా ఉంచారు.మా చిత్తశుద్ధి,సుపరిపాలన చూసే ప్రజలు ఓటు వేశారు.ఇంత శాతం ఓటింగ్ గతంలో ఎప్పుడూ నమోదు కాలేదు.ఈసారి ఎన్నికల్లో ప్రజలు కూడా భాగస్వాములయ్యారు.ప్రజాప్రతినిధులకు నిత్యం సేవాభావం ఉండాలి.సేవాభావం ఉన్నంతవరకు ప్రజాదరణ మనకు ఉంటుంది.

ప్రజల సహకారంతో ఈ దేశాన్ని ప్రగతిబాట పట్టిస్తాం.సామాన్యులను గౌరవించేలా మన ప్రవర్తన ఉండాలి.దేశసేవ కోసం నా శక్తి సామర్థ్యాలు వినియోగిస్తా.ఈ ఐదేళ్లలో భారత్‌ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాం. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఈసారి కూడా సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం. మనపై ఈ అనుకూలధోరణి అనేది నమ్మకం అనే దారంతో ముడివేసి ఉంది. ఈ నమ్మకం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉండడమే కాదు.. సాధారణంగా జనంలోనూ ఉంటుందని మోడీ అన్నారు.మాట్లాడే ముందు మోడీ..పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోని రాజ్యాంగం దగ్గర తలవంచి నమస్కరించారు.బీజేపీ కురువృద్ధులు ఎల్ కే అద్వాణీ,మరళీ మనోహర్ జోషి పాదాలకు మోడీ నమస్కరించి వాళ్ల ఆశీర్వాదం తీసుకున్నారు.

pm modi
elected
NDA
Leader
people
Voted
Pro-IncumbencY

మరిన్ని వార్తలు