PM, Amit Shah Meet, Decision On Lockdown Likely Tomorrow

ప్రధానితో అమిత్ షా మంతనాలు.. లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం రేపే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రధాని మంత్రి నరేంద్ర మోడీని హోం మంత్రి అమిత్ షాతో పాటు సీనియర్ నేతలు కలిసి చర్చించారు. కరోనావైరస్ లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయాన్ని శనివారం ప్రకటించనున్నారు. మూడుసార్లు పొడిగించిన లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనుంది. వైరస్ కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తారా లేదా ప్రత్యేక సడలింపులు ఏమైనా ఉన్నాయా అనేది తేలనుంది. 

ఎకానమీని పునరుద్ధరించే క్రమంలో వ్యాపార లావాదేవీలు రీ ఓపెన్ చేస్తారా అనేది చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థితిగతులపై సమాచారం సేకరించి విశ్లేషణలు జరిపింది హోం శాఖ. కొన్ని రాష్ట్రాలు తమను ఆపేవారు లేరంటూ ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగించేశాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తేయడమే మంచిదని భావిస్తున్నారంతా.

అమిత్ షాతో గోవా ముఖ్యమంత్రి జరిపిన సంభాషణల్లో లాక్‌డౌన్ మరో 15 రోజుల పాటు పొడిగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తే ఏ సర్వీసులు ఓపెన్ లో ఉంటాయి. ఏవి మూతపడతాయో ఓ సారి చూద్దాం. 

ఎయిర్ సర్వీసులు: లాక్‌డౌన్ 5.0లో దాదాపు అన్ని ట్రావెల్ రూట్లు ఓపెన్ చేసేస్తారు. ప్రభుత్వం అన్ని ఎయిర్‌లైన్ కంపెనీలకు ప్రయాణించే అనుమతులు కల్పించింది. డిమాండ్‌ను బట్టి ఆపరేటర్లే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం చెప్పేసింది.

ఒకవేళ ఎయిర్ ట్రావెల్ పునరుద్ధరించినా.. ప్రభుత్వం లిమిటెడ్ విమానాలకు మాత్రమే అనుమతులు ఇవ్వనుంది. అంటే 100 మాత్రమే బయల్దేరనున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ ప్రయాణాల గురించి మాట్లాడిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్షదీప్ సింగ్ పూరి వచ్చే ఆగష్టు నుంచి మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. 

రైలు సర్వీసులు: వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్ శ్రామిక్ స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నాయి. మే 28వరకూ 3వేల 736రూళ్లు 50లక్షల మంది కార్మికులను సొంతూళ్లకు తీసుకెళ్లాయి. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ లకే ఎక్కువ మంది కార్మికులు వెళ్లారు. 

జూన్ 1 నుంచి 100 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని రైల్వేస్ అనుకుంటుంది. వీటి తర్వాత ఏసీ రూళ్లను నడిపే అవకాశాలు ఉన్నాయి. 

రాష్ట్ర స్థాయిలో బస్సు సర్వీసులు: కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అంతర్రాష్ట్ర ప్రయాణాలు మొదలైపోయాయి. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ కు ప్రయాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా జూన్ 1నుంచి అదే ఫాలో కానున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. తక్కువ మందితో ప్రయాణాలు జరగనున్నాయి. 

షాపులు, మార్కెట్లు, మాల్స్: అత్యవసరం కాని వస్తువుల అమ్మకాలకు అనుమతులు ఇవ్వనున్నారు. లాక్‌డౌన్ 5.0లో ఎక్కువ షాపులు తెరవడం, మార్కెట్ ప్రాంతాల్లో కూడా ఓపెన్ చేస్తారు. షాపింగ్ మాల్స్ గురించి ఇప్పుడే చెప్పకపోవచ్చు. మిగిలిన షాపులు తెరిచే అవకాశాలు ఉన్నాయి. 

జిమ్స్, సినిమా థియేటర్లు, మతపరమైన ప్రదేశాలు: జిమ్స్, థియేటర్లు, మతపరమైన ప్రదేశాలు మూసే ఉంచుతారు. కొన్ని నగరాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేసేశారు. రక్షణ కవచం తొడుక్కొని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఓపెన్ చేస్తుండగా కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంకా మూసే ఉంచారు. 

స్కూల్స్: హ్యూమన్ రిసోర్స్ డైరక్టరీ మినిస్ట్రీ స్కూల్స్ రీ ఓపెన్ మీదే పనిచేస్తున్నాయి. 9, 10, 11, 12 తరగతుల వారికి ముందుగా ఓపెన్ చేస్తారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మాస్క్ లు ధరిస్తూ.. రావాలి. ఉదయం సమయంలో అసెంబ్లీలను దాదాపు నిర్వహించకూడదని ప్లాన్ చేస్తున్నారు. CBSE జులై మొదటి వారాల్లో పదో తరగతి పరీక్షలు ఉంటాయని చెప్పేసింది. 

Related Posts

Trending

Latest News