మంటలతో మసాజ్ : కండరాల నొప్పులకు పురాతన టెక్నిక్

Submitted on 13 September 2019
Playing With Fire: Masseur Uses Ancient Technique To Ease Muscle Pain

కండరాల నొప్పులతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఫలితం లేదా? మజిల్ పెయిన్ ఇబ్బంది పెడుతుందా? అయితే ఈజిప్ట్ మసాజ్ గురించి తెలుసుకోవాల్సిందే. అబ్దెల్ రహీమ్ సయీద్ (35) అనే ఈజిప్టియన్ మసాజర్ పురాతన టెక్నిక్ తో క్షణాల్లో కండరాల నొప్పిని తగ్గిస్తున్నాడు. నీలే డెల్టా గవర్నేట్ ఆఫ్ ఘార్బేయాలో తన దగ్గరకు వచ్చే బాధితులకు మంటలతో మసాజ్ చేస్తున్నాడు. ఇదో పురాతన పారోనిక్ టెక్నిక్.. ‘ఫైరీ టవల్’గా పిలుస్తుంటారు. 

అంటే.. మంటలతో మసాజ్ చేస్తారని అర్థం. మసాజ్ చేసే సమయంలో ఒంటిపై ఆయిల్, చేమంతి జాతికి చెందిన హెర్బ్ ఆయిల్ వాడుతారు. మజిల్ పెయిన్ ఉన్న ప్రాంతంలో ఆల్కాహాల్ రాసిన టవల్ వేసి మంట పెడతారు. వేడి తగిలి కండరాల నొప్పి నుంచి వెంటనే రిలీఫ్ పొందవచ్చు. ఈ మసాజ్ చేసే ముందు బాధిత వ్యక్తి బోర్లా పడుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అతడిపై సయీద్ టవల్స్ కప్పుతాడు. ఇలా కొన్ని లేయర్ల వరకు ఉంచుతాడు. ఆ టవల్ పై ఆల్కాహాల్ చల్లుతాడు. వెంటనే నిప్పు అంటిస్తాడు. ఒక నిమిషం పాటు టవల్ అలానే ఉంచుతాడు. గాఢత తగ్గేవరకు మండుతుంది. 

ఆ తర్వాత తడి టవల్‌తో మంటలను ఆర్పేస్తాడు. ఇలా చేయడం వల్ల శరీరంలోని తేమను పీల్చుకుంటుందని, త్వరగా కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని సయీద్ చెబుతున్నాడు. అధిక రక్త పోటు (హై బ్లడ్ ప్రెజర్) లేదా కిడ్నీ ఫెయిల్యూర్, హీమోఫీలియాతో బాధపడేవారికి ఈ మసాజ్ టెక్నిక్ చేయనని సయీద్ చెప్పాడు. మార్కోలో ఫైరీ టవల్ టెక్నిక్ ను ఓ నిపుణుడి ఆధ్వర్యంలో నేర్చుకున్నట్టు తెలిపాడు. ఈజిప్ట్ లోని ఇన్సిస్ట్యూట్ల నుంచి చాలా వరకు  సర్టిఫికేట్లు పొందినట్టు చెప్పాడు. 

ఫైరీ మసాజ్ ట్రీట్ మెంట్ తర్వాత వంద శాతం కండరాల నొప్పులు మటుమాయమై పోయినట్టు మహమ్మద్ అల్ షాయిర్ అనే 30ఏళ్ల వ్యక్తి సంతోషం వ్యక్తం చేశాడు. ‘మసాజ్ ట్రీట్ మెంట్ ముందు సరిగా నిలబడలేక పోయేవాడిని. కారులో నుంచి బయటకు రావాలంటే నా వెన్నును చాచుడం కష్టంగా ఉండేది. రెండో సెషన్ తర్వాత నా శరీరంలో కదలిక బాగుంది. తొలుత కొంచెం నిర్లక్ష్యంగా ఉండేవాడిని. కానీ, ఇకపై అలా ఉండదు’ అని తెలిపాడు. 

Egyptian masseur
Ancient Technique
Muscle Pain
fiery towel
Abdel Rehim Saeid

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు