వైరల్ వీడియో : బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Submitted on 22 October 2019
Plane gets stuck under bridge in China. Viral video has the Internet in splits

విమానం ఎంత పెద్ద సైజులో ఉంటుందో అందరికి తెలుసు. అలాంటి విమానం ఓ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది అంటే ఎవరు నమ్ముతారు. కానీ.. అక్కడ బ్రిడ్జి కింద ప్లేన్ కింద ఇరుక్కుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే  నవ్వు ఆగదు. ఇరుక్కుపోయిన విమానాన్ని బయటకు తీయడానికి వారు పడరాని పాట్లు పడ్డారు. టైర్లలో గాలి తీసి ఎట్టకేలకు విమానాన్ని కదిలించారు.

వివరాల్లోకి వెళితే.. చైనాలోని హర్బిన్‌ పట్టణంలో భారీ ట్రక్కుపై విమానాన్ని తరలిస్తున్నారు. ఇతర వాహనాలకు ఇబ్బందులు కలగకుండా ఆ విమానానికి రెక్కలు తొలగించి తరలిస్తుండగా.. ఓ బ్రిడ్జి కింద  ఇరుక్కుపోయింది. దీంతో డ్రైవర్లు కంగారు పడ్డారు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు.

ఆ తర్వాత వారికి ఓ ఐడియా వచ్చింది. వెంటనే ట్రక్కు టైర్లలో కొంచెం గాలిని తీశారు. దీంతో ట్రక్కు ఎత్తు కొంచెం తగ్గింది. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాన్ని కొంచెం ముందుకు కదిలించారు. అలా బ్రిడ్జి కింద నుంచి విమానం బయటపడింది. అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ వెంటనే మళ్లీ ట్రక్కు టైర్లలో గాలిని నింపి ప్లేన్ ని తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవ్వులు పూయిస్తోంది.

సాధారణంగా భారీ ట్రక్కుల టైర్లలో అవసరమైన దానికన్నా గాలి ఎక్కువే ఉంటుంది. సో.. కొంచెం గాలి తీసినా.. ప్రాబ్లమ్ లేదు. అయితే... క్షణాల్లోనే మళ్లీ టైర్లలో గాలి తిరిగి నింపాల్సి ఉంటుంది. లేదంటే.. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని నిపుణులు తెలిపారు.

plane
gets stuck
under bridge
China
Viral Video

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు