మల్కాజ్‌గిరిలో హైడ్రామా : థియేటర్ లో బాంబుపెట్టామంటూ ఫోన్‌కాల్

Submitted on 26 May 2019
phone call to bomb at theater in malkajgiri

హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. సాయిరాం థియేటర్లో బాంబు పెట్టామన్న ఫోన్‌కాల్‌తో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. సినిమాను ఆపి.. థియేటర్‌ను డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. చివరకు ఎటువంటి బాంబు లభ్యం కాకపోవడంతో.. ఫేక్ కాల్‌గా నిర్ధారించారు. 

సాయిరాం థియేటర్లో బాంబు పెట్టామని డయల్ 100 ద్వారా శనివారం ( మే 25, 2019) రాత్రి 9.30 గంటల సమయంలో తమకు ఫోన్‌కాల్‌ వచ్చిందని.. తాము బ్యాక్ కాల్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే థియేటర్ కు దగ్గరకు వెళ్లి తనిఖీలు చేపట్టామని... సీట్లు, పార్కింగ్ ప్లేస్, సెల్లార్, బిల్డింగ్ పైన క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. ఎక్కడ కూడా అనుమానాస్పద పధార్థాలు లభ్యం కాలేదన్నారు. బెదిరింపు ఫోన్ కాల్ కు చేసిన అగంతుడిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఫేక్ కాల్ చేసినా, రూమర్స్ సృష్టించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 

Phone Call
BOMB
theater
malkajgiri
Hyderabad

మరిన్ని వార్తలు