అదిరిపోయే చాలెంజ్.. ట్రాష్‌టాగ్ క్లీన్ చాలెంజ్

Submitted on 13 March 2019
People are Cleaning Up Streets to Complete the Viral Trashtag Challenge

ఈ రోజుల్లో ఏ పని చేసినా వాటిని ఫోటోలు తీసుకోడం లేదా వీడియోలు తీసుకుని సోషల్ మీడీయాలో వైరల్ చేయడం జనాలకు అలవాటుగా మారింది. ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుంచి ఆన్లైన్ చాలంజ్లు ఎక్కువైయాయి ఏవేవో చాలెంజ్ లు వస్తుంటాయి...కానీ ఇదివరకు వచ్చిన ఐస్ బకెట్ చాలెంజ్, కికి చాలెంజ్ల గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ చాలెంజ్‌లు అన్నీ ఏదో టైమ్ పాస్ కోసం క్రియేట్ చేసినవే.. కానీ తాజాగా వైరల్ అయిన చాలెంజ్ మాత్రం టైమ్ పాస్ కోసం క్రియేట్ చేసింది కాదు. దానికి ఓ ఉపయోగం ఉంది.

ఈ రోజుల్లో భూమ్మీద మనం హాయిగా ఆరోగ్యంగా బ్రతకలేకపోతున్నాం అంటే తప్పు మనదే. అందుకే మీకు ఎక్కడైనా చెత్త కనపడితే ఆ చెత్తతో ఓ ఫోటో తీసుకుని..ఆ చెత్తను క్లీన్ చేశాక మరోసారి ఓ ఫోటో తీసి రెండింటినీ కలిపి ట్రాష్ టాగ్ తో సోషల్ మీడీయాలో షేర్ చేయండి.

ఈ హ్యాష్‌టాగ్ 2015లో ప్రారంభమైనా.. బైరాన్ రోమన్ అనే ఓ ఫేస్‌బుక్ యూజర్ దీన్ని ప్రారంభించాడు. అయితే రోమన్ చెత్త ఉన్నప్పుడు, చెత్తను క్లీన్ చేశాక దిగిన ఫోటోను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేసి ఈ చాలెంజ్ గురించి వివరించాడు. దాంతో నెటిజన్లు ఆ చాలెంజ్‌ పై దృష్టి పెట్టడం ప్రారంభించారు. అలా ఆ చాలెంజ్ వైరల్ అవడమే కాదు.. చాలామంది ఆ చాలెంజ్ పూర్తి చేయడం కోసం చెత్తను క్లీన్ చేసి సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. 

Trashtag Challenge
trending
social media
Cleaning Challenge
2019

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు