ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌తో చేతులెలా కలుపుతారు?

Submitted on 14 March 2019
Pawan Kalyan Fires On Modi, Jagan, KCR

రాజమండ్రి : ఆంధ్రులను ద్రోహులు, కుట్రదారులు అని తిట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేతులు ఎలా కలుపుతారు? అని వైసీపీ చీఫ్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రులను తిట్టిన కేసీఆర్ పంచన ఎలా చేరుతారు అని నిలదీశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణకు పాస్ పోర్టు తీసుకుని వెళ్లాలని నాడు వైఎస్ అన్న విషయాన్ని మర్చిపోయారా? అని అడిగారు.

మీ తండ్రి వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నారా? అని జగన్ ను ప్రశ్నించారు. చంద్రబాబు మీద కోపం ఉండొచ్చు, తప్పు లేదు.. కానీ కేసీఆర్ తో చేతులు కలపడం ఏంటి? అని పవన్ సీరియస్ అయ్యారు. రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభలో జగన్, కేసీఆర్, మోడీలు జోడీ కట్టారు అనే అనుమానాన్ని పవన్ వ్యక్తం చేశారు. పోటీ పడితే మనలో మనం పడాలని పవన్ హితవు పలికారు. రాష్ట్రంపై కేసీఆర్ పెత్తనమేంటి? అని మండిపడ్డారు.
Read Also : ముఖ్యమంత్రి పదవిపై కోరిక లేదు : పవన్ కళ్యాణ్

వాస్తవానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుతో తనకు, తన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పవన్ చెప్పారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను వారితో చేతులు కలపలేదని పవన్ అన్నారు. అలాంటి వారితో జగన్ కు స్నేహం ఎందుకు అని పవన్ ప్రశ్నించారు. బీజేపీకి తాను పల్లకీ మోశానని గుర్తు చేసిన పవన్.. దొడ్డిదారిన ఆ పార్టీ వైసీపీకి అండగా ఉంటానటే మనం ఏం చేస్తామన్నారు. మోడీ నుంచి తానేమీ ఆశించలేదన్నారు. బీజేపీతో కలిసి ఉన్నారో లేదో జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కేసీఆర్ తో ఎందుకు కలిసున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also : అభివృద్ధి చేస్తారనే కొందరి పల్లకీలు మోశాను : పవన్ కళ్యాణ్

ఏపీని ముక్కలు చేసి తీరని అన్యాయం చేసిందని బీజేపీపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన ప్రధాని మోడీకి జగన్ ఎలా దగ్గరవుతారని పవన్ ప్రశ్నించారు. వ్యక్తిగత విభేదాలతో రాష్ట్ర అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని పవన్ అన్నారు. చంద్రబాబు మీద కోపంతో ఆంధ్రులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోనని బీజేపీకి పవన్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also : కడప, పులివెందుల ఎంపీ టికెట్లు బీసీలకు ఇస్తారా : జగన్ కు పవన్ సవాల్

Pawan kalyan
Jansena
BJP
KCR
Ys Jagan
Ysrcp
KTR
Modi
Chandrababu
Rajahmundry

మరిన్ని వార్తలు