రౌడీ రాజకీయాలపై పవన్ ఫైర్ : తాట తీస్తానంటూ హెచ్చరిక

Submitted on 22 March 2019
Pawan Kalyan Angry On Rowdy Politics

రౌడీ రాజకీయాలపై జనసేనానీ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పులివెందుల నుండి రౌడీమూకలు పశ్చిమగోదావరి జిల్లాలో చొరబడితే తానే స్వయంగా వారి పని పడుతానని పవన్ హెచ్చరించారు. వైసీపీ, టీడీపీలపై పంచ్‌లు విసిరారు పవన్. మార్చి 22వ తేదీ శుక్రవారం భీమవరంలో పవన్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
Read Also : అభివృద్ధి జరగలేదు : భీమవరంలో పవన్ నామినేషన్

సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే ఏమీ చేయలేని జగన్..రాష్ట్రానికి ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. కులం..మతాలతో రాజకీయాలను ముడిపెట్టవద్దన్నారు. రైతులకు అండగా ఉంటానని పేర్కొన్న పవన్..వైసీపీ, టీడీపీలు కలిసి భీమవరంలో తనను ఓడించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ నేతలు ఏపీలో రాజకీయాలు చేస్తే ఊరుకోమన్నారు. టీఆర్ఎస్‌తో వైసీపీ కలిసిపోయిందని, కేసీఆర్ వచ్చి ఏపీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. విభజన రాజకీయాలు మానుకోవాలని పవన్ హితవు పలికారు. 

పవన్ హామీలు : - 
* హైదరాబాద్ ధీటుగా భీమవరం అభివృద్ధి. 
* భీమవరం డంప్ యార్డును తరలిస్తా. 
* ఇక్కడ జరగని అభివృద్ధి త్వరగానే చేసి చూపిస్తా.  
* ఆక్వా కల్చర్ వల్ల నీటి కలుషితం కాకుండా చర్యలు. 
* ఉచిత విద్య పథకాన్ని భీమవరం నుండే ప్రారంభం. 
* భీమవరంను దేశంలో నంబరవన్ సిటీని చేస్తా.
* అమెరికా వాళ్లు భీమవరంలో ఉండేలా అభివృద్ధి చేస్తా.
Read Also : చంద్రబాబు సరికొత్త స్లోగన్ : టీడీపీకి ఓటు వేస్తే గెలుపు ప్రజలదే అట

Pawan kalyan
Angry
Rowdy Politics
Bheemavaram
Vishakapatnam
JanaSena Party

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు