పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు

Submitted on 21 October 2019
Parliament’s winter session to commence from November 18

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ -18,2019నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-13,2019న సమావేశాలు ముగియనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు లోక్ సభ,రాజ్యసభ సెక్రటరీలకు సమాచారమిచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ పై పార్లమెంట్ అఫైర్స్ క్యాబినెట్ కమిటీ(CCPA) గతవారం రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ నివాసంలో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.

భారత్ లో ఆర్థికమాంద్యం కొనసాగుతున్న సమయంలో ఈ సారి శీతాకాలసమావేశాలు వస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్యాక్స్ రేటుని తగ్గించడం వంటి అనేక నిర్ణయాలను కేంద్రం తీసుకుంటున్నప్పటికీ వ్యవసాయం,బ్యాంకింగ్ వంటి రంగాలలో మోడీ సర్కార్ పాలసీలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

ఈ శీతాకాల సమావేశాల్లో  పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశముంది. ఎన్ఆర్సీ,ఆర్టికల్ 370రద్దు వంటి అనేక అంశాలపై ప్రతిపక్షాలు పార్లమెంట్ వేదికగా పోరాటానికి రెడీ అవుతున్నాయి. ఈ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నట్లు అర్థమవుతోంది.

Parliament
WINTER SESSION
economic slowdown
NOVEMBER
opposition

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు