ఏడాదంతా బిర్యానీ ఫ్రీ: ప్యారడైజ్ వరల్డ్ కప్ ఆఫర్

Submitted on 12 June 2019
Paradise Hotels is a free biryen year of the company Cricket World Cup offer

బిర్యానీ ఫ్రీ. ఆ మాట వినిపిస్తే చాలు రెక్కలు కట్టుకుని మరీ వాలిపోయి ఫుల్ గా లాగించేయాలనిపిస్తుంది కదూ. ఒక్కరోజు రెండు రోజులు కాదు. ఏకంగా ఏడాది పాటు ఫ్రీగా బిర్యానీ తినే అవకాశం వస్తే కాదనేవాళ్లుంటారా చెప్పండి. ముఖ్యంగా బిర్యానీ ప్రియులు. 

అటువంటి బిర్యాపీ ప్రియుల కోసం ప్యారడైజ్ హోటల్స్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. #వ‌ర‌ల్డ్‌క‌ప్‌విత్‌ప్యార‌డైజ్‌ (#WorldCupWithParadise) పోటీలో పాల్గొని సంవత్సరం అంతా వారంలో ఒక బిర్యానీ చొప్పున 52 వారాలు ఉచితంగా, గిఫ్ట్ రూపంలో పొందవ‌చ్చ‌ని తెలిపింది.  ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్‌క‌ప్ మానియా కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రికెట్ ప్రియుల కోసం ఈ ఆఫర్ ను ప్రకటించింది ప్యారడైజ్ సంస్థ. 


ఈ పోటీ జూన్ 7వ తేదీన ప్రారంభ‌మై జూలై 18వ తేదీ 2019 వ‌ర‌కు భార‌త‌దేశం అంత‌టా నిర్వ‌హించనుంది ప్యారడైజ్ సంస్థ. ఈ పోటీలో పాల్గొని విజయం సాధించినవారికి ప్ర‌తివారం బ‌హుమ‌తులు ఇస్తారు.  బిర్యానీ ప్రియులు ఈ స‌మ‌యంలో ప్యార‌డైజ్ ఫుడ్ కోర్టుల డైన్ ఇన్/ఎక్స్‌ప్రెస్ ఔట్‌లెట్స్ కు వచ్చి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వచ్చి పోటీ గురించి వివ‌రంగా తెలుసుకోవ‌చ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు పోటీలో పాల్గొనవచ్చని ప్యారడైజ్ సంస్థ  సీఈఓ గౌతం గుప్తా తెలిపారు. 

ప్యారడైజ్ క్రికెట్ వరల్డ్ కప్ కాంటెస్ట్ ఇలా ..
* ముందుగా మీరు ఏదైనా ప్యారడైజ్ ఔట్‌లెట్‌కు వెళ్లాలి.
* అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫోటో దిగాలి.
* ప్యారడైజ్ ఆతిథ్యంపై మీ అనుభవాన్ని రాయాలి.
* ఆ ఫొటోను ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి @ParadiseFoodCourt ఐడీకి ట్యాగ్ చేయాలి.
* ఆ పోస్ట్‌ను మీరు షేర్ చేయాలి.
* ప్రతీ వారం ఒక విజేతను ఎంపిక చేస్తారు.
* ఫోటో బాగా తీయడంతో పాటు ఎవరైతే బాగా డిస్క్రిప్షన్ రాస్తారో వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* గెలిచినవారికి ఏడాదంతా ఉచితంగా బిర్యానీ ఇవ్వనుంది ప్యారడైజ్.
* ప్యారడైజ్ మేనేజ్‌మెంట్ విజేతల్ని ఎంపిక చేస్తారు.

Paradise
Hotels
biryen year
Company
cricket
World Cup
Offer
free

మరిన్ని వార్తలు