ఆధార్ లింక్ చేశారా? : ఆగస్టు 31 దాటితే PAN కార్డు చెల్లదు 

Submitted on 10 July 2019
PAN card to be declared invalid after August 31, if not linked with Aadhaar

మీకు పాన్ కార్డు ఉందా? అయితే వెంటనే ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డు చెల్లదు. ఆగస్టు 31 దాటితే ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులన్నీ చెల్లుబాటు కావు. ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన 10అంకెల (అల్ఫాన్యూమరిక్) పాన్ కార్డులను ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి. గతంలో పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కార్డుదారులను ఎన్నోసార్లు అలర్ట్ చేశారు. 

కార్డుదారుల వెసులబాటు కోసం గడువు తేదీని కూడా పొడిగిస్తూ వచ్చారు. ఆగస్టు 31, 2019 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ తేదీ దాటితే ఆధార్ లింక్ కాని సుమారుగా 20 కోట్ల పాన్ కార్డులు చెల్లనవిగా ప్రకటిస్తారు. ముఖ్య గమనిక. ఒకసారి ట్యాక్స్ డిపార్ట్ మెంట్ పాన్ కార్డును రద్దు చేస్తే.. మళ్లీ తిరిగి వాడేందుకు పనికిరాదు. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇండియాలోని పాన్ కార్డుదారుల్లో సుమారు 20కోట్ల మందికి ఆధార్ కార్డు లేకపోవడం అసాధ్యమన్నారు. దేశంలో దాదాపు అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయన్నారు. ఇండియాలో 43 కోట్ల మంది పాన్ కార్డుదారులు ఉంటే.. 120కోట్ల మంది ఆధార్ కార్డుదారులు ఉన్నారని చెప్పారు. 

క్రెడిట్ కార్డు కావాలన్నా.. బ్యాంకుల నుంచి లోన్లు పొందాలన్నా కచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే. పాన్ కార్డు లేకుండా అక్రమంగా లోన్లు, క్రెడిట్ కార్డులు పొందడం వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆదాయ శాఖ భావిస్తోంది. అందుకే ఆధార్, పాన్ కార్డు లింక్ తప్పనిసరి చేసింది. నేపాల్, భూటాన్ కు చెందిన కొందరు తమ ఐడెంటీ ఫ్రూఫ్ తో ఈజీగా లోన్లు, క్రెడిట్ కార్డులు పొంది అక్రమాలకు పాల్పడుతుండటంతో ఆదాయ శాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ 2019 ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో పాన్ కార్డు అవసరం లేదన్నారు. 

ఆధార్ నెంబర్‌తో మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చునని చెప్పారు. అంటే.. ఆధార్, పాన్ కార్డును పరస్పరం మార్చుకునేందుకు అదనపు సౌలభ్యం కలిపిస్తున్నట్టు తెలిపారు. ఆధార్ మాత్రమే సమర్పిస్తే.. పన్నుదారునికి పాన్ కార్డులేదని భావిస్తూ.. ఐటీ శాఖ కొత్త పాన్ కార్డు జారీ చేయడం జరుగుతుంది. ఈ రెండు డేటాబేస్ లను అనుసంధానం చేయడం జరుగుతుంది. ఐటీ రిటర్న్స్ సమయంలో పాన్ కార్డు లేకపోయినా ప్రాసెస్ పూర్తి చేసేందుకు ఆధార్ కార్డుతో అనుమతి ఇచ్చేందుకు వీలుంటుంది. 

ఇదివరకే పాన్ కార్డు జారీ అయిన పన్నుదారులు.. ట్యాక్స్ చెల్లించే సమయంలో పాన్ నెంబర్ సమర్పించవచ్చు. ఆధార్ లింక్ అయి ఉంటే ఆటోమాటిక్ గా పాన్ నెంబర్ కూడా షేర్ అయినట్టే. అందుకే ఐటీ శాఖ.. ఆధార్, పాన్ అనుసంధానం తప్పనసరిగా చేయాలని చెబుతూ వస్తోంది. ఎవరైతే ఆగస్టు 31 నాటికి ఆధార్, పాన్ కార్డుతో అనుసంధానం చేసుకోరో వారి పాన్ కార్డు సెప్టెంబర్ 1, 2019నుంచి చెల్లుబాటు కాదు.  

pan card
invalid
August 31
 Aadhaar
Aadhaar number
Tax
CBDT
Nirmala Sitharaman 


మరిన్ని వార్తలు