పాకిస్థానీ జంటకు క్రికెటంటే పిచ్చి : పెళ్లైన రాత్రే ఏంచేశారో చూడండి!

Submitted on 7 November 2019
Pakistani couple watch AUS vs PAK match on wedding night, netizens call it #CoupleGoals

పాకిస్థానీ జంటకు కొత్తగా పెళ్లైంది. దంపతులిద్దరికి క్రికెట్ అంటే పిచ్చి.. ఆ రోజు రాత్రే ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఇంకేముంది.. పెళ్లైన సంగతి మరిచిపోయారు. క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఆ రాత్రంతా గడిపేశారు. 

క్రికెట్ అనేది ఒక గేమ్ మాత్రమే కాదని, ఆసియాలో ఒక భాగమని చాటిచెబుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. పాకిస్థానీ జంట క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారిక ట్విట్టర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ ఫొటోను షేర్ చేసింది. 

అమెరికాలో ఉండే హసన్ తస్లీం అనే వ్యక్తి ICC షేర్ చేసిన ఈ ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ‘ ఈ రోజు నా పెళ్లి రాత్రి.. క్రికెట్ మ్యాచ్ చూడకుండా మిస్ అయ్యేది లేదు’ అని #CoupleGoals హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లు పెడుతూ జంటను అభినందిస్తున్నారు. 

Pakistani couple
AUS vs PAK match
wedding night
CoupleGoals

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు