భారత్ అభిమానుల్లా పాకిస్తాన్ వాళ్లు చేయరు: పాక్ కెప్టెన్

Submitted on 12 June 2019
Pakistan People Won't Do That: Sarfaraz Ahmed

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా టాంటన్ వేదికగా ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడుతోంది. ఈ సందర్భంగా భారత్ అభిమానులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. పాకిస్తాన్ అభిమానులను వెనకేసుకొచ్చాడు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ బ్యాట్స్‌మన్ స్మీవ్ స్మిత్‌ను ఛీటర్.. ఛీటర్ అని అరిచిన సంగతి తెలిసిందే. 

పాకిస్తాన్ అభిమానులు మాత్రం అలా స్పందించరని చెప్పుకొచ్చాడు. 'పాకిస్తాన్ వాళ్లు అలా చేస్తారని అనుకోను. పాకిస్తాన్ ప్రజలకు క్రికెట్ అంటే ఇష్టం. ప్లేయర్లపై ప్రత్యేక అభిమానం చూపిస్తారని తెలిపాడు. బాల్ ట్యాంపరింగ్ కారణంగా నిషేదం ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్‌పై విమర్శలు తగదంటూ స్టేడియం నుంచే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖండించాడు. 

భారత అభిమానుల తరపున తాను క్షమాపణలు చెప్పినట్లు మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. పాకిస్తాన్ ప్రస్తుతం మూడు గేమ్‌లకు గాను మూడు పాయింట్లతో కొనసాగుతోంది. 

Pakistan
Sarfaraz Ahmed
2019 icc world cup
world cup 2019
Australia
STEVE SMITH

మరిన్ని వార్తలు