దలైలామాను మసూద్ తో పోల్చిన పాక్ జర్నలిస్ట్...చీల్చి చెండాడిన నెటిజన్లు

Submitted on 14 March 2019
Pak Journalist Compares Dalai Lama With Masood Azhar, Slammed On Twitter


టిబెట్ బౌద్ధమత గురువు,నోబెల్ శాంతి బహుమతి విజేత దలైలామాను జైషే చీఫ్ మసూద్ అజార్ తో పోల్చాడు పాక్ కు చెందిన ఓ జర్నలిస్ట్. దలైలామాను మసూద్ తో పోల్చడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆ జర్నలిస్ట్ ను చీల్చి చెండాడుతున్నారు. అహింసావాదిని ఉగ్రవాదితో పోల్చుతావా అంటూ అతడిపై ఫైర్ అవుతున్నారు. వీడు జర్నలిస్గ్ ముసుగులో ఉన్న ఉగ్రవాది అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Twitter Trending : చైనా వస్తువులను బ్యాన్ చేయాల్సిందే

మసూద్ అజార్ ని ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించకుండా చైనా బుధవారం మరోసారి తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకున్న విషయం తెలిసిందే.ఈ అంశంలో మరింత లోతైన విచారణ చేపట్టడానికి సమయం కావాలని చైనా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.ఈ అంశంపై పాక్‌ జర్నలిస్ట్‌ హమీద్‌ మిర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ...మసూద్ ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించేందుకు చైనా ఎందుకు అడ్డుకుందో అర్థం చేసుకోవడం చాలా సులభం. చైనా శత్రువుకి దశాబ్దాలుగా భారత్ ఆశ్రయమిస్తుంది.అతని పేరే దలైలామా అని ట్వీట్ చేశాడు.

 

China
UNSC
resolution
Pak
journalist
HAMID MIR
DALILAMA
Terrorist
Masood Azhar
SHELTER
india

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు