మీ డేటా Apps చేతుల్లో : యూజర్ పర్మిషన్ లేకున్నా తస్కరిస్తున్నారు

Submitted on 10 July 2019
Over 1k Android apps gain your data even if denied permission

స్మార్ట్ ఫోన్లు వచ్చాక డేటా షేరింగ్ మరింత వేగవంతమైంది. క్షణాల్లో ఒకరి డేటా మరొకరికి ఈజీగా షేర్ అవుతోంది. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో లభ్యమయ్యే యాప్స్ యూజర్లను బోల్తా కొట్టిస్తున్నాయి. ఆన్ లైన్ లో నమ్మలేని ఫ్రాడ్ యాప్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఆండ్రాయిడ్ బేసిడ్ యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్ల శాతం ఎక్కువగా ఉండటంతో మాల్ వేర్ యాప్స్ తో యాప్ స్టోర్ లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. 

వీటిలో ఏ యాప్స్ సురక్షితమో తెలియదు. స్మార్ట్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసిన యాప్స్ నుంచి యూజర్ పర్సనల్ డేటా షేర్ అవుతుందని తెలుసా? యూజర్ పర్మిషన్ ఇవ్వకపోయినా సరే.. అక్రమంగా యూజర్ ప్రైవసీ డేటాను దొంగలి స్తున్నారని ఎప్పుడైనా గుర్తించారా? అలాంటి డేంజరస్ యాప్స్ గురించి ఓ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. అది మనకు తెలియకుండానే వాడే యాప్స్ ద్వారా పర్సనల్ డేటా తస్కరిస్తున్నట్టు నివేదిక హెచ్చరిస్తోంది. 

వెయ్యికి పైగా ఆండ్రాయిడ్ యాప్స్.. యూజర్ల ప్రైవసీ డేటాను కొట్టేసినట్టు అధ్యయనంలో తేలింది. దాదాపు 1,325 ఆండ్రాయిడ్ యాప్స్.. యూజర్ పర్మిషన్ ఇవ్వకపోయినా వారి డివైజ్ లోని డేటాను సేకరించినట్టు గుర్తించింది. అమెరికాలోని అంతర్జాతీయ కంప్యూటర్ సైన్స్ ఇన్సిస్ట్యూట్ (ICSI) పరిశోధక బృందం తమ అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించినట్టు న్యూస్ పోర్టల్ నివేదించింది.  

ఐసీఎస్ఐలోని డైరెక్టర్ ఆఫ్ యూజబల్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రీసెర్చ్ సెర్జే ఇజెల్మాన్.. ఈ అధ్యయాన్ని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లోని ప్రైవసీ కాన్ఫిరెన్స్ లో ప్రదర్శించారు. దీనికి సంబంధించి సెప్టెంబర్ 2018లో గూగుల్, FTCలు తమ పరిశోధకులు హెచ్చరించినట్టు ఆయన గుర్తు చేశారు. 

డేంజరస్ యాప్స్ లో ఒక యాప్ పేరు Shutterfly ను రివీల్ చేశారు. ఈ యాప్ లో ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు. చాలామంది యూజర్లు తెలియక తమ ఫొటోలను ఈ యాప్ లో ఎడిట్ చేస్తున్నారు. జీపీఎస్ ద్వారా యూజర్ల ఫోటోల నుంచి డేటాను షేర్ చేస్తూ తమ సొంత సర్వర్లలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు. షట్టర్ ఫ్లై ఒక ప్రకటనలో.. ఫొటో సర్వీసు యాప్స్ చాలా ఉన్నాయని, యూజర్ల డేటాను యూజర్ ఎక్స్ పీరియన్స్ కోసం మాత్రమే డేటాను వినియోగిస్తుంది తప్ప దుర్వినియోగం చేయడం లేదని సమర్థించుకుంది. 

షట్టర్ ఫ్లై యాప్.. ప్రైవసీ పాలసీకి అనుగుణంగా.. ఆండ్రాయిడ్ డెవలపర్ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారమే పనిచేస్తుందని స్పష్టం చేసింది. FTC వెబ్ సైట్లో అధ్యయనాన్ని పబ్లీష్ చేయగా.. 153 యాప్స్ లో శాంసంగ్ హెల్త్, బ్రౌజర్ యాప్స్ ఉన్నట్టు గుర్తించామని, అందులో 500 మిలియన్లకు పైగా డివైజ్ ల్లో ఈ యాప్స్ ఇన్ స్టాల్ చేసినట్టు పరిశోధనలో వెల్లడైంది. రిపోర్టు ప్రకారం.. ఈ అధ్యయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆగస్టులో యూజనెక్స్ సెక్యూరిటీ కాన్ఫిరెన్స్ లో వెల్లడించనున్నట్టు సెర్జే ఇజెల్మాన్ తెలిపారు. 

1k Android apps
your data
permission
Researchers
Serge Egelman


మరిన్ని వార్తలు