విష జ్వరాలు : ఉస్మానియా ఆస్పత్రి ఓపీ సమయం పెంపు

Submitted on 4 September 2019
Osmania Hospital OP Time Increase

తెలంగాణలో విష జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. జ్వరాల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 24 గంటలపాటు ఔట్ పేషెంట్ సేవలు కొనసాగనున్నాయి. ఉచితంగా డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 

హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఓపీ సమయాన్ని పెంచారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సమయాన్ని పెంచడంతో పాటు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఓపీని కొనసాగిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ తెలిపారు. విష జ్వరాలతో రోగుల తాకిడి పెరుగుతుండడంతో ఓపీ సమయాన్ని పెంచినట్లు చెప్పారు.

అదేవిధంగా ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగాన్ని అప్రమత్తం చేసి, రోగులకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విషజ్వరాలతో వచ్చే వారికి ఉచితంగా డెంగీ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

మే నెలలో 155 మంది విష జ్వరాలతో ఆస్పత్రిలో చేరగా 22 డెంగీ కేసులుగా నిర్ధారణ అయ్యాయని వెల్లడించారు. జూన్‌లో 130 విషజ్వరాలలో 15 డెంగీ, జూలైలో 241 విషజ్వరాలలో 75 డెంగీ, ఆగస్టులో 385 విషజ్వరాలలో 96 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆయన వివరించారు.
 

Osmania Hospital
OP
Time
Increase
Hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు