ముంబైలో విషాదం : చిన్నారిని మింగేసిన మ్యాన్‌హోల్

Submitted on 11 July 2019
One of half year Old Boy falls into open manhole in Mumbai, rescue effort on  

నేవీ ముంబైలో విషాదం జరిగింది. ఏడాదిన్నర బాలుడు ప్రమాదవశాత్తూ మ్యాన్ హోల్‌లో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకూ ఆడుకుంటు కేరింతలు కొట్టిన చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్ హోల్లో పడి విగతజీవిగా మారాడు. ఈ ఘటన నేవీ ముంబైలోని గుర్గాన్, అంబేద్కర్ నగర్ ప్రాంతంలో బుధవారం జరిగింది.

దీనికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మ్యాన్ హోల్ తెరిచి ఉంచి అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలైంది. 

అంతా చీకటిగా ఉండటంతో మ్యాన్ హోల్ ఉన్న విషయం గుర్తించడానికి వీలుగా లేదు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మ్యాన్ హోల్లో పడిన చిన్నారి దివ్యాన్ష్ ను.. బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మ్యాన్ హోల్ కు సంబంధించిన అన్ని మార్గాల్లో అధికారులు చిన్నారి మృతదేహం కోసం వెతుకుతున్నారు.

దివ్యాన్ష్ మృతి విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు బీఎంసీ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం తొలిసారి కాదు. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మ్యాన్ హోల్లో పడి కనీసం 10మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 

Boy
open manhole
rescue effort
Divyansh 


మరిన్ని వార్తలు