‘పాగల్ పంతీ’ - ట్రైలర్!

Submitted on 22 October 2019
Official Trailer: Pagalpanti

అనిల్ కపుర్, జాన్ అబ్రహాం, ఇలియానా, అర్షద్ వార్షి మెయిన్ లీడ్స్‌గా.. ‘నో ఎంట్రీ’, ‘వెల్‌కమ్’, ‘సింగ్ ఈజ్ కింగ్’, ‘రెడీ’, ‘ముబారకన్’ సినిమాలతో అలరించిన అనీస్ బాజ్మీ దర్శకత్వంలో.. టీ-సిరీస్, పనోరమా స్టూడియోస్ నిర్మిస్తున్న మూవీ.. ‘పాగల్ పంతీ’.. పుల్‌కిత్ సామ్రాట్, కృతి కర్బందా, శౌరభ్ శుక్లా, ఊర్వశీ రౌతేలా ఇంపార్టెంట్ రోల్స్ చేశారు..

రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘వైఫై భాయ్‌’ గా అనిల్ కపూర్, ‘సంజన’ గా ఇలియానా, ‘జుంకీ’ గా అర్షద్ వార్షి, ‘రాజ్ కిషోర్‌’ గా జాన్ అబ్రహాం, ‘చందు’ గా పుల్‌కిత్, ‘రాజా సాహెబ్‌’ గా శౌరభ్ శుక్లా కనిపించనుండగా.. కృతి కర్బందా ‘జాన్వీ’ గా, ‘కావ్య’ గా ఊర్వశీ రౌతేలా నటించారు. అవుట్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘పాగల్ పంతీ’ నవంబర్ 22న విడుదల కానుంది.

Read Also : కొమురం భీమ్ జయంతి సందర్భంగా RRR టీమ్ ట్వీట్

మ్యూజిక్ : అంకిత్ తివారీ, యోయో హనీ సింగ్, సచిన్ - జిగార్, సినిమాటోగ్రఫీ : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : అమితాబ్ శుక్లా, నిర్మాతలు : భూషణ్ కుమార్, అభిషేక్ పాఠక్, కృష్ణ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, డిస్ట్రిబ్యూషన్ : ధర్మా ప్రొడక్షన్స్.

Anil Kapoor
John Abraham
Ileana D'Cruz
Arshad Warsi
T-Series
Panorama Studios
Anees Bazmee

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు