సరూర్ నగర్ సూరిగా సుధాకర్

Submitted on 23 April 2019
Nuvvu Thopu Raa Theatrical Trailer-10TV

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ కోమాకుల హీరోగా, నువ్వు తోపురా అనే సినిమా రూపొందుతుంది. బేబీ జాహనవి సమర్పణలో, యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై శ్రీకాంత్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. నిత్యా శెట్టి హీరోయిన్‌. రీసెంట్‌గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసాడు. సరూర్ నగర్ సూరిగా సుధాకర్ చాలాబాగా చేసాడు. అతని యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ బాగుంది. పక్కా హైదరాబాదీ నేటివిటీకి అద్దం పట్టేలా ఈ మూవీ ఉండబోతుంది.. జీవితంలో రాజీ పడడం, ఏ విషయంలోనూ ఒంగి ఉండడం తెలియని ఒక కుర్రాడు, జాబ్ కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, తన క్యారెక్టర్ మార్చుకున్నాడా? ప్రేమని దక్కించుకున్నాడా, లేదా అనే పాయింట్‌తో, నువ్వు తోపురా రూపొందుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

సీనియర్ నటి నిరోషా, జెమినీ సురేష్ తప్ప నోటెడ్ ఆర్టిస్టులెవరూ ఉన్నట్టులేదు. ప్రకాష్ వేలాయుధన్, వెంకట్ సి దిలీప్ కెమెరా వర్క్, సురేష్ బొబ్బిలి, దీపక్ ఆర్ఆర్ బాగుంది. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న నువ్వు తోపురా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఆర్ట్ : తోట తరణి, ఎడిటింగ్ : ఎస్‌బి ఉద్ధవ్, కథ, మాటలు : అజ్జూ మహంకాళి, నిర్మాత : శ్రీకాంత్, దర్శకత్వం : హరినాధ్ బాబు.

వాచ్ ట్రైలర్...

Sudhakar Komakula
Nitya Shetty
Daduvai Srikanth
Harinath Babu.B

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు