వాల్మీకిలో నితిన్ గెస్ట్ రోల్

Submitted on 19 September 2019
Nthiin Cameo in Valmiki

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన 'వాల్మీకి' మరి కొద్ది గంటల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ద్వారా తమిళ యంగ్ హీరో అధర్వ తెలుగు పరిశ్రమకు పరిచయవుతున్న సంగతి తెలిసిందే.

అతనితో పాటు యంగ్ హీరో నితిన్ కూడా వాల్మీకిలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. 'వాల్మీకిలో గెస్ట్ రోల్ చేసినందుకు మా భీష్మకు థ్యాంక్స్..  లవ్యూ డార్లింగ్'.. అంటూ నితిన్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు వరుణ్. కాసేపటికి.. 'వాల్మీకి మూవీలో పార్ట్ అయినందుకు హ్యాపీగా, సరదాగా ఉంది.. మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్.. మీ భీష్మ.. సెప్టెంబర్ 20న గత్తర్ లేపాలే' అంటూ మరో పిక్ షేర్ చేశాడు నితిన్.

కథ : కార్తీక్ సబ్బరాజ్, స్ర్కీన్ ప్లే : మధు, చైతన్య, కెమెరా : అయాంక బోస్, సంగీతం : మిక్కీ జె మేయర్, ఎడిటింగ్ : చోటా కె.ప్రసాద్, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా.

 

Varun Tej
Nthiin
Pooja Hegde
Atharvaa
Mickey J Meyer
14 Reels Plus
Harish Shankar

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు