టుడే రిలీజ్ : NEET UG-2019 అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ 

Submitted on 15 April 2019
NTA To Release NEET UG 2019 Admit Card Today

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NEET)పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు సోమవారం (ఏప్రిల్ 15, 2019) రిలీజ్ కానున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్ యూజీ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులు.. MCI గుర్తింపు పొందిన మెడికల్, డెంటల్ వైద్యవిద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందవచ్చు. మెడికల్, డెంటల్ కోర్సు ప్రవేశం కోరే విద్యార్థులకు మాత్రమే నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తారు. 2019 ఏడాదిలో నీట్ పరీక్ష కోసం దరఖాస్తున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డుల కోసం NTA అధికారిక వెబ్ సైట్ ntaneet.nic.inలో లాగిన్ కావాల్సి ఉంటుంది.
Read Also : ఇదేం దారుణం : వీధికుక్కలకు అన్నం పెట్టిందని ఫైనేశారు

ఈ వెబ్ సైట్ లో నీట్ అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్ చేసి నీట్ 2019 అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మే 5, 2019 (మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)న నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు గుర్తించుకోవాల్సిన మఖ్యమైన విషయాలు తెలుసుకోండి..

NTA.. నీట్ అడ్మిట్ కార్డులను అభ్యర్థుల ఈమెయిల్, మొబైళ్లకు SMS పంపడం జరగదు. NEET పరీక్ష Admit Cards డౌన్ లోడ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ntaneet.nic.in వెబ్ సైట్ ను తప్పక విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్ సైట్లో అడ్మిట్ కార్డులను అప్ డేట్స్ చేసిన తర్వాత నీట్ అభ్యర్థులు వెబ్ సైట్లో Admit Card Download లింక్ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

అడ్మిట్ కార్డు Download చేసుకోండిలా : 
1. NEET UG 2019 అధికారిక వెబ్ సైట్ www.ntaneet.nic.in విజిట్ చేయండి.
2. హోం పేజీలో Admit Card Download చెక్ చేయండి.
3. మీ అకౌంట్ లాగిన్ వివరాలు ఎంటర్ చేయండి. 
4. అకౌంట్ రిజిస్ట్రేషన్ సమయంలో ఎంటర్ చేసిన వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి.
5. అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ అప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి Print out తీసుకోండి. 
6. అడ్మిట్ కార్డులోని మీ వ్యక్తిగత వివరాలను చెక్ చేసుకోండి. 
7. రూల్ నెంబర్, మీ పేరు, తండ్రి పేరు, కేటగిరీ, సబ్ కేటగిరీ, ఫొటోగ్రాఫ్, సంతకం, పుట్టినరోజు కరెక్ట్ గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి.
8. ల్వాంగేజ్ క్వచ్ఛన్ పేపర్, పరీక్షా కేంద్రం పేరు, చిరునామా సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. 
9. అడ్మిట్ కార్డుపై ఉన్న ఇన్ స్ర్టక్షన్స్ ను పూర్తిగా జాగ్రత్తగా చదవండి.
10. NEET యూజీ పరీక్ష అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేయగానే, PDF ఫార్మాట్ కాపీ ఒకటి మీ రిజిస్ట్రర్డ్ ఈమెయిల్ కి పంపిస్తారు. 
Read Also : కోటిపై చర్యలు తీసుకోండి : డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు

NET UG 2019
NEET admit card
nta
ntaneet

మరిన్ని వార్తలు