క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. Nokia 7.2 రిలీజ్.. 48MP ట్రిపుల్ కెమెరాలు.. ధర ఎంతంటే? 

Submitted on 19 September 2019
Nokia 7.2 launched in India starting at Rs 18,599: Check Specs, availability and offers

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ బ్రాండ్ నోకియా నుంచి ఇండియన్ మార్కెట్లలో  కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. అదే.. నోకియా 7.2 స్మార్ట్ ఫోన్. సెప్టెంబర్ ప్రారంభంలో IFA 2019 ఈవెంట్ సందర్భంగా నోకియా 6.2తో పాటు కొత్త స్మార్ట్ ఫోన్ 7.2 మోడల్ లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ లో ప్రీమియం గ్లాస్, మెటల్ డిజైన్ తో పాటు కొత్త ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. zeiss ఆప్టిక్స్, ప్యూర్ ప్లే వాటర్ డ్రాప్ స్క్రీన్ సెటప్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ.18వేల 599గా కంపెనీ నిర్ణయించింది. 

సెప్టెంబర్ 23 నుంచి మార్కెట్లో లభ్యం కానుంది. నోకియా 7.2 మోడల్ ఫోన్ లో మొత్తం రెండు వేరియంట్లు (4GB + 64GB, 6GB +6GB)తో వస్తోంది. బేస్ మోడల్ ప్రారంభ ధర రూ.18వేల 599 నుంచి ఉంటుంది. ఆ తర్వాత నుంచి రూ.19వేల 599 ధరతో మార్కెట్లో లభ్యం కానుంది. నోకియా 7.2 మోడల్ ఫోన్ కొనుగోలు చేయాలంటే nokia.com/phones, Flipkart సహా ఇతర రిటైల్ స్టోర్లలో సెప్టెంబర్ నెలఖారు నుంచి లభ్యం కానున్నాయి. 

నోకియా 7.2 ఫోన్ కొనుగోలుదారులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో కంపెనీ స్పెషల్ ఆఫర్లు అందిస్తోంది. రిటైల్ ఔట్ లెట్ నుంచి ఈ కొత్త ఫోన్ విక్రయిస్తే.. హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డుపై 10శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. EMI ఆఫర్ కూడా ఉంది. అక్టోబర్ 31, 2019 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్, ఐడిఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు CD లోన్స్, HDBFS నుంచి నోకియా 7.2 ఫోన్ కొనుగోలు చేస్తే స్పెషల్ జీరో డౌన్ పేమెంట్, ప్రాసెసింగ్ ఫీజు, నో ఇంట్రెస్ట్ కాస్ట్ ఆఫర్ పొందవచ్చు. జియో సబ్ స్ర్కైబర్లు కూడా రూ.7,200, రూ.198, రూ.299 ప్లాన్లపై బెనిఫెట్స్ ఆఫర్ చేస్తోంది. నోకియా వెబ్ సైట్ ద్వారా నోకియా 7.2 ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు గిఫ్ట్ కార్డ్ పొందవచ్చు. 

ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఎక్సేంజ్ పై రూ.2వేల వరకు అదనంగా పొందవచ్చు. ఈ ఆఫర్ కూడా అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ICICI బ్యాంకు క్రెడిట్ కార్డులు, యాక్సస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో ఫ్లిప్ కార్ట్ అందించే బిగ్ బిలియన్ ఫెస్టివల్ డేస్ సేల్ సమయంలో 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. 

నోకియా 7.2 స్పెషిఫికేషన్లు - ఫీచర్లు ఇవే :
* 6.3 అంగుళాల FHD + ప్యూర్ డిస్ ప్లే స్క్రీన్
* వాటర్ డ్రాప్ నాచ్, HDR సపోర్ట్ 
* 2.5D గొర్లిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్  (ఫ్రంట్ అండ్ బ్యాక్)
* అల్యూమినియం ఫ్రేమ్ ( బ్యాక్ సైడ్)
* ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (బ్యాక్) సర్క్యూలర్ మాడ్యూల్
* రియర్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ 
* 7.2 ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 660 చిప్ సెట్
* 6GB ర్యామ్, (64GB + 128GB) ఇంటర్నల్ స్టోరేజీ 
* మైక్రో SD కార్డ్ (512GB ఎక్స్ ఫ్యాండబుల్ మెమెరీ)
* 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 
* 5MP డెప్త్ సెన్సార్ (బ్యాక్)
* 20MP సెల్ఫీ కెమెరా ( ఫ్రంట్)
* 3,500mAh బ్యాటరీ 
* స్టాక్ ఆండ్రాయిడ్ 9 పై (ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రామ్)

Nokia 7.2
india
 Flipkart
retail outlets
premium glass design
Bajaj Finance
IDFC First Bank
HDFC Bank CD loans and HDBFS

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు