కరోనాకాలపు శ్రవణుడు:600 కి.మీ రిక్షా తొక్కుతూ కన్నవారిని సొంతూరికి చేర్చిన 11ఏళ్ల బాలుడు

11-Year-Old Gets Parents Home Amidst Lockdown by Pedalling Tricycle Cart for 600 kms

11 ఏళ్లు బాలుడు..9రోజులు..600ల కిలోమీటర్లు దూరం ప్రయాణం..గాయపడిన తల్లి..ప్రమాదంలో కాలు విరిగిన తండ్రి. ఓ ట్రై సైకిల్. ఇదేదో మాటల మాంత్రికుడు..దర్శకుడు త్రివిక్రమ్ సినిమా స్టోరీ కాదు. లాక్ డౌన్ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వలస కూలీల వాస్తవగాథల్లో ఈ 11 ఏళ్ల బాలుడు విషాదగాథ.


కరోనా కాలంలో లాక్ డౌన్ సాక్షిగా..అంధులైన తల్లిదండ్రులనుకావాడిపై మోసిన పురాణకాలపు శ్రవణుడికి ఏమాత్రం తీసిపోడు ఈ  తారక్ అనే 11 ఏళ్ల బాలుడు. మండు వేసవిలో నిప్పుల్లాంటి వేడు వడగాల్పులు శరీరాన్ని కాల్చేస్తున్నాకూడా సొంత ఊరికి చేరుకుందామనే ఆశతో బతుకుమీద ఆకాంక్షతో బడుగు జీవులు వాస్తవగాథ. కళ్లు చెమర్చే..వింటేనే మనస్సు ద్రవించిపోయి గుండెగది చెమ్మగిల్లే కడుదీనగాథలు. 

వలస కూలీల వేదనలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంతూరికి చేరుకుందామని బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ కు వలస వచ్చింది తబారక్ కుటుంబం. తబారక్ తల్లిదండ్రులతో కలిసి వారణాసిలో ఉండేవారు. తండ్రి ఇస్రాఫిల్ వారణాసిలో ఓ పాలరాయి 20 సంవత్సరాలు షాపులో పనిచేశాడు.  తల్లి సోగ్రా కూలిపనికి వెళ్లేది. వారికి ఐదుగురు పిల్లలు. తబారక్ ఐదవవాడు. అన్నయ్య తమిళనాడులో ఉంటున్నాడు. ముగ్గురు అక్కలు వేరే ప్రాంతంలో ఉన్నారు. పనిచేసేచోట ప్రమాదవశాత్తు ఇస్రాఫిల్ కు  కాలు విరిగిపోయింది. తల్లి వరికోత పనికి వెళ్లినప్పుడు చేయి తెగిపోయి పెద్ద గాయమైంది.

ఈ క్రమంలో కరోనా కష్టంతో లాక్ డౌన్ విధించటంతో పూట గడవటం కష్టమైపోయింది. దీంతో సొంత ఊరికి ప్రయాణమయ్యారు.చేతిలో చిల్లిగవ్వలేదు. దీంతో వారికుండే ట్రైసైకిల్ పై ప్రయాణమయ్యారు. అలా ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి బీహార్ వరకూ వెళ్లాలంటే 11 ఏళ్ల వయస్సున్న తబారక్ ఒక్కడే దిక్కయ్యాడు. 
సొంత ఊరికి వెళితేఎలాగోలా బ్రతకవచ్చనే ఆశతో 600కిలోమీటర్లు రిక్షామీదనే ప్రయాణమయ్యారు. కాలువిరిగిన తండ్రిని..గాయమైన తల్లిని ఎక్కించుకుని ఏకంగా తొమ్మిదిరోజుల పాటు రిక్షా తొక్కుతూ సొంత ఊరు జోకిహాట్ కు చేరుకున్నాడు ఈ అభినవ శ్రవణుడు.

ఆ ప్రమాణంలో రోడ్డు పక్కనే పడుకుంటూ ఆరోజుకి దొరికింది తింటూ తొమ్మిది రోజులపాటు ప్రయాణంలో నానా అగచాట్లు ఎట్టకేలకు సొంత ఊరు చేరుకున్నారు.  
ఇప్పుడు వారికి కరోనా లక్షణాలు ఉన్నాయోమోననే అనుమానంతో అధికారులు వారిని క్వారంటైన్ లో ఉంచారు. వీరి దీనగాథ తెలుసుకున్న ఆర్జేడీ ఎమ్మెల్యే షహనావాజ్ తబారక్ కుటుంబానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. వాళ్లు క్వారంటైన్ నుంచి బైటకు వచ్చాక వారిని కలుస్తానని వారికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Read: కరోనా మహమ్మారి అంతం కావాలని నరబలి ఇచ్చిన అర్చకుడు

మరిన్ని తాజా వార్తలు