బీ కేర్ ఫుల్ : తెలుగు రాష్ట్రాలకి మరో ముప్పు..మిడతలతో జాగ్రత్త

Another threat to the Telugu states Beware of Locusts

కరోనాతో పాటు మిడతలు మరో సవాల్ విసురుతున్నాయని, తెలుగు రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా ఉండాలని రిటైర్డ్ ప్రొఫెసర్ శశి భూషణ్ సూచించారు. 27 ఏళ్ల తర్వాత దీని ప్రభావం అధికంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. డిసెంబర్ మాసంలో భారతదేశంలోకి మిడతలు ఎంటర్ అయ్యాయన్నారు. రైతులు, ప్రబుత్వావలు మిడతలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిడతలు ఎక్కడినుంచి వచ్చాయి ? దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లనుందనే దానిపై రిటైర్డ్ ప్రొ.శశిభూషణ్ తో 10tv మాట్లాడింది. 

ఎడారిల నుంచి పాక్ సైడ్ నుంచి వస్తాయని, జులై నుంచి అక్టోబర్ వరకు వస్తాయన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ తో ప్రభుత్వాలు పోట్లాడుతున్న సమయంలో మిడతల దండు రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. 1950 నుంచి ఇవి వస్తున్నాయన్నారు. 2018-19లో ఏడారి ప్రాంతంలో వర్షాలకు సమృద్ధిగా కురిశాయని, డిసెంబర్ మాసంలో అకాల వర్షాలు రావడంతో మిడతలు పునరోత్పత్తి చేసుకున్నాయన్నారు. ఫిబ్రవరి, మార్చిలో గుర్తించినా..ఏప్రిల్ 11న ఓ సంస్థ హెచ్చరికలు జారీ చేసిందని..అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు.

ఆకుపచ్చగా కనిపించే పంటలపై ఇవి దాడి చేస్తాయని తెలిపారు. వర్షాలు పడిన సమయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై వ్యవసాయ శాఖ సూచనలు చేయాలని, రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 16 జిల్లాలో మిడతలు వచ్చాయన్నారు. తక్షణమే తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయి..చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ప్రొ. శశి భూషణ్ సూచించారు.

రాష్ట్ర సరిహద్దుల్లోని నిజామాబాద్‌, కామారెడ్డి, అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.మహారాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ సమస్యపై నిన్న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘాబృందాలు, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు.

ప్రధానంగా ఈ మిడతల వల్ల పంటలపై అధిక ప్రభావం చూపనుంది. పచ్చని చేలు చూస్తుండగానే..మటుమయం అవుతాయి. లక్షలు, కోట్లలో వచ్చిపడుతున్న ఈ మిడతల వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలను రక్షించుకొనే పనిలో పడ్డారు. ఆఫ్రికా ఖండంలో మొదలైన ఈ దండు..అరేబియా, పాకిస్తాన్ దాటి భారత్ ను కమ్మేసింది.

Read: భారత్ లో మిడతల దండు జ్ఞాపకాలు.. కరోనాతో పాటు..మరో తలనొప్పి

మరిన్ని తాజా వార్తలు