సల్మాన్‌తో ముద్దుపై కో-స్టార్ భాగ్యశ్రీ ఇప్పుడేం అన్నారంటే?

When Salman Khan was asked to catch and smooch his ‘Maine Pyaar Kiya’ co-star Bhagyashree

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, హీరోయిన్ భాగ్యశ్రీ కలిసి 1989లో నటించిన ‘మైనే ప్యార్ కియా’ అప్పట్లో సూపర్ హిట్ అయింది. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అప్పటినుంచి వీరి కాంబినేషన్ అంటే ఫుల్ క్రేజ్ ఉండేది. సాధారణంగా నటులు వెండితెరపై ఒకటి రెండు సార్లు మాత్రమే రొమాన్స్ సీన్లలో కనిపిస్తారు. కానీ, వారి అభిమానులు మాత్రం మూవీలోని వారి కెమిస్ట్రీని ఎప్పటికీ మర్చిపోరు. సల్మాన్ ఖాన్ తన మొదటి సినిమా నుంచి ముద్దుసీన్లకు దూరంగా ఉండేవాడు. అదే పాలసీని కొనసాగించాడు. కానీ, ఓ రోజున సల్మాన్ ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చింది. 

Bhagyashree, Salman

అది కూడా మూవీ ఫొటోషూట్‌లో... మైనే ప్యార్ కియా మూవీకి ఫొటోషూట్ జరుగుతోంది. సల్మాన్, నటి భాగ్యశ్రీ అక్కడే ఉన్నారు. ఇంతలో ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఒకరు సల్మాన్ దగ్గరకు వచ్చి తనకు ఒక ఫోజు కావాలన్నాడు. అందుకు సల్లూ భాయ్ సరే అన్నాడు. కో‌స్టార్ భాగ్యశ్రీ తెలియకుండా ఆమెను పట్టుకుని ముద్దు పెట్టేయండి అంటూ అడిగారట.. వారి మాటలు పక్కనే ఉన్న భాగ్యశ్రీకి కూడా వినపడింది. కొంచెం సిగ్గుగా అనిపించినా అలానే ఉండిపోయింది. కానీ, సల్మాన్ ముద్దు పెట్టేందుకు అంగీకరించాడు. భాగ్యశ్రీ అనుమతి తీసుకోండి ఫస్ట్ అంటూ ఫొటోగ్రాఫర్‌కు చెప్పాడని అప్పటి విషయాన్ని భాగ్యశ్రీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. 
Bhagyashree, Salman

బాలీవుడ్‌లో భాగ్యశ్రీ ఒక మూవీలోనే కనిపించారు. చాలా ఏళ్ల నుంచి ఆమె వెండితెరకు దూరంగా ఉన్నారు. ఆమె కుమారుడు అభిమన్యు దస్సాని మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తన మొదటి మూవీ ‘Mard Ko Dard Nahi Hota’ అభిమన్యు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మరోవైపు సల్మాన్ ఖాన్ Radhe మూవీలో నటిస్తున్నారు. ‘భారత్’ కో స్టార్ దిశా పటానీతో కలసి ఆయన మళ్లీ జత కట్టనున్నారు. సల్మాన్ కొత్త మూవీకి దర్శకుడు ప్రభుదేవా డైరెక్షన్ చేస్తున్నాడు. రన్ దీప్ హుడా, జాకీ షిరోఫ్ కీ రోల్స్ నటిస్తున్నారు. 

Read: సిక్స్ ప్యాక్ తో అమ్మాయిల గుండెల్లో హీట్ పెంచిన యంగ్ హీరో

మరిన్ని తాజా వార్తలు