సైకిల్ దొంగగా మారిన వలస కూలీ.. గుండెను పిండేలా క్షమాపణ లేఖ

Migrant Worker Steals Bicycle To Go Home 250 Kms Away, Leaves Heartfelt 'Sorry' Note For Owner

లాక్‌డౌన్‌ దెబ్బకు సొంత గ్రామాలకు వెళ్లేందుకు కూలీలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. పిల్లలతో కలిసి వేలాది కాలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తన్న వారి కష్టాలు చూస్తుంటే కన్నీరు వస్తుంది. ఇదిలా ఉంటే ఓ వలస కార్మికుడు.. అటువంటి కష్టం తట్టుకోలేక దొంగగా మారాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ వలస కార్మికుడు 250కిలోమీటర్ల దూరం ఉత్తర ప్రదేశ్‌లోని ఇంటికి వెళ్లేందుకు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో సైకిల్‌ను దొంగిలించాడు . అయితే, ఆ వ్యక్తి తన పరిస్థితిని వివరిస్తూ క్షమాపణ నోటును కూడా అక్కడే వదిలేశాడు.

హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మహమ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి రాజస్థాన్‌లో భరత్ పూర్ జిల్లాలోని రారా గ్రామంలో సహబ్ సింగ్ అనే వ్యక్తి ఇంటి నుండి సైకిల్‌ను దొంగిలించాడు. సింగ్ తన ఇంటి వరండాను శుభ్రం చేస్తుండగా ఈ లేఖ కనిపించింది.

“మెయిన్ మజ్దూర్ హన్, మజ్బూర్ భీ. మెయిన్ ఆప్కా గునెగర్ హు. ఆప్ కీ సైకిల్ లేకర్ జా రాహా హు. ముజే మాఫ్ కర్ దేనా. ముజే బరేలీ తక్ జన హే. మేరే పాస్ కోయి సాధన్ నహి హి.. ఔర్ విక్లాంగ్ బచ్చా హై.."

(నేను కూలీ, నిస్సహాయంగా ఉన్నాను. నేను ఒక తప్పు చేస్తున్నాను. అందుకు మీరు నన్ను క్షమించండి. నేను మీ సైకిల్‌ని తీసుకుంటున్నాను. నా ఇంటికి చేరుకోవడానికి నాకు వేరే మార్గాలు లేవు మరియు నాతో దివ్యాంగుడైన పిల్లవాడు ఉన్నాడు. నేను బరేలీకి  వెళ్ళాలి.)  అంటూ హిందీలో రాసిన నోట్ అక్కడ వదిలేశాడు

Migrant Worker Steals Bicycle

ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. 

Read Here>> నిప్పులు కురిసే ఎర్రటిఎండల్లో కాలిపోతున్న చిట్టి పాదాలు

మరిన్ని తాజా వార్తలు