వాల్మీకి టైటిల్ మార్చండి

Submitted on 6 September 2019
Vishwa Hindu Parishad Protest Valmiki Movie Title

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమా 'వాల్మీకి'. ఈ సినిమా టైటిల్‌ ను మార్చాలని కోరుతూ గురువారం (సెప్టెంబర్ 5, 2019)న CGO టవర్స్‌లోని సెన్సార్‌ బోర్డు కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. 

ఈ టైటిల్‌ మార్చాలని బోయ కులస్తులు గొడవ చేస్తున్నారన్నారు. వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవమని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్య‌క్తి పేరు ఓ హింసాత్మ‌క సినిమాకు ఎలా వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళనకారులు.

వెంటనే సినిమా పేరును మార్చాలని భజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎం.సుభాశ్‌ చందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సెన్సార్‌ బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖను కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా టీజ‌ర్ కూడా అదిరిపోయింది. ఇందులో వ‌రుణ్ తేజ్ లుక్ మ‌రీ రాక్ష‌సంగా ఉంది. ఇదే అభిమానులను ఆక‌ట్టుకుంటుంది. సినిమాపై అంచ‌నాల‌ను కూడా పెంచేస్తుంది.

Vishwa Hindu Parishad
Protest Valmiki Movie
Change Title Immediatly

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు